Summer: వేసవికాలంలో తప్పకుండా తినాల్సిన మూడు రకాల పండ్లు.. తింటే బోలెడు లాభాలు!
వేసవికాలంలో తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల పండ్లను తినడం లేదా డైట్ లో చేర్చుకోవడం లాంటివి చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Tue - 18 February 25

వేసవికాలం వచ్చింది అంటే చాలు ఎండ దెబ్బకు ప్రజలు భయపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఉక్కపోతే వడదెబ్బ అధిక వేడికి శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా సరే ఇంకా దాహం వేస్తూ ఉంటుంది. వీటి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మండే ఎండల్లో చల్లగా ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే అలసటను తగ్గించుకోవాలి అనుకుంటే వేసవిలో దొరికే కొన్ని రకాల పండ్లు బెస్ట్ అని చెబుతున్నారు. శీతల పానీయాలు కంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు పండ్లు ఎన్నో రెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయట. ఇంతకీ ఆ పండ్లు ఏవి అన్న విషయానికి వస్తే..
పుచ్చకాయ.. పుచ్చకాయను ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు. జ్యూస్ ల రూపంలో అలాగే ముక్కల రూపంలో తింటూ ఉంటారు. పుచ్చకాయలో దాదాపు 90% నీరు ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. పుచ్చకాయను వేసవికాలంలో తినాల్సిన వాటిల్లో మొదటి లిస్టులో చెబుతూ ఉంటారు. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పుచ్చకాయల్లో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ b6 రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. పొటాషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది.. వేసవికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో ఈ పుచ్చకాయ కూడా ఒకటి..
సమ్మర్ లో తీసుకోవాల్సిన వాటిలో మామిడిపండు కూడా ఒకటి. ఈ మామిడి పండ్లు మనకు ఉగాది నుంచి లభించడం మొదలుపెట్టి వేసవికాలంలో కూడా లభిస్తూ ఉంటాయి. కొంతమంది ఇష్టంగా తింటే మరి కొంతమంది వీటిని తినడానికి భయపడుతూ ఉంటారు.. అయితే పండ్లలో రారాజుగా పిలిచే మామిడి పండ్లు ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ కు ఎంతో బాగా సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించి కడుపులో నిండుగా ఉంచుతుంది. మామిడి పండులో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ మామిడి పండ్లు బోలెడు వ్యాధులను కూడా దూరం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో జలుబు ఫ్లూ వంటివి తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడతాయి. వేసవికాలంలో మాత్రమే దొరికే ఈ మామిడి పండును తప్పకుండా తినాలని చెబుతున్నారు.
అలాగే వేసవికాలంలో తినాల్సిన పండ్లలో నారింజ పండు కూడా ఒకటి. ఈ నారింజ పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. పొటాషియం మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి కండరాల నొప్పిని తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ బలమైన రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అంటు వ్యాధులతో పోరాడేలా శరీర సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందట. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. ఈ కారణంగా చెమట ద్వారా పొటాషియం ఎక్కువ కోల్పోతాము. దీని ఫలితంగా కండరాల తిమ్మిరి, లేదా కండరాల పనితీరు దెబ్బతినడం జరుగుతుందట. నారింజలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుందట. ముఖ్యంగా వేసవి కాలంలో నారింజ తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.