Belly Fat: వీటిని నానబెట్టి తింటే చాలు.. బాణ లాంటి పొట్ట అయినా కరిగి స్లిమ్ గా అవ్వాల్సిందే!
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పదార్థం నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, బాణ లాంటి పొట్ట అయినా సరే కరిగిపోతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Thu - 8 May 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది బెల్లీ ఫ్యాట్ అధిక బరువు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడానికి అధిక బరువులు ఎత్తడం, జిమ్ లో కష్టపడడం, వ్యాయామలు చేయడం, వాకింగ్ చేయడం, హోం రెమిడీలు పాటించడం,డైట్ ఫాలో అవ్వడం ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి మీరు పెద్దగా తిప్పలు పడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును కొన్ని ఆహారాలను నానబెట్టి తింటే మీ పొట్ట చాలా తొందరగా కరిగిపోతుందట. మరి ఎలాంటి పదార్థాలు నీటిలో నానబెట్టి తింటే పొట్ట కరిగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చియా విత్తనాలను నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చట. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని,వీటిని నీళ్లలో లేదా ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలలో నానబెట్టి తింటే మీ జీర్ణక్రియ ఈజీ అవుతుందని, దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది మీ కడుపును రోజంతా నిండుగా ఉంచుతుందట. అలాగే అతిగా తినడాన్ని తగ్గించి పొట్ట కొవ్వును ఈజీగా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఈ గింజల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపునే తింటే జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయట. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయట. దీనిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయట ఇవి మన కడుపును నిండుగా ఉంచుతాయని, వీటిని తీసుకోవడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ కరగడంతో పాటుగా బరువు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బాదం పప్పులో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. వీటిని రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తింటే మీ కడుపు నిండుగా ఉంటుందట. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుందట. అలా అని వీటిని ఎక్కువగా తినడం అస్సలు మంచిది కాదు. అలాగే ఓట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తింటే శరీరంలోని పోషకాల స్థాయి పెరుగుతుందట. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కవగా ఉంటుందని, ఇది కార్బోహైడ్రేట్ ను నెమ్మదిస్తుందని, శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుందని,ఆకలిని తగ్గిస్తుందని చెబుతున్నారు. కాబట్టి బబెల్లీ ఫ్యాట్ అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.