Neck Pain : మెడ నొప్పి వస్తుందా.. తగ్గడానికి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
డ నొప్పి(Neck Pain) వస్తే మనం ఏ పని చేయడానికైనా ఇబ్బంది పడుతూ ఉంటాము. మెడ నొప్పి ఎక్కువగా బండి నడిపే వారికి, కంప్యూటర్(Computer) లో ఎక్కువసేపు వర్క్ చేసేవారికి వస్తుంది.
- By News Desk Published Date - 11:00 PM, Sun - 20 August 23

మన శరీరంలో ప్రతి భాగానికి ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మన తలను శరీరాన్ని కలిపేదే మెడ. అయితే మెడ నొప్పి(Neck Pain) వస్తే మనం ఏ పని చేయడానికైనా ఇబ్బంది పడుతూ ఉంటాము. మెడ నొప్పి ఎక్కువగా బండి నడిపే వారికి, కంప్యూటర్(Computer) లో ఎక్కువసేపు వర్క్ చేసేవారికి వస్తుంది. మెడ మీద ఎక్కువ బరువు పడినప్పుడు, వ్యాయామాలు ఎక్కువగా చేసినప్పుడు కూడా మెడ నొప్పి వస్తుంది.
వాహనాలు నడిపేటప్పుడు వచ్చే కుదుపుల వలన కూడా మెడ నొప్పి ఎక్కువగా వస్తుంది. మెడలో సున్నితమైన కండరాలు ఉంటాయి ఇవి ఒత్తిడికి గురయినప్పుడు మెడ నొప్పి వస్తుంది. మెడకు రక్తసరఫరా జరగకపోయినా, మెడలో ని డిస్క్ లు కదిలినా కూడా మెడ నొప్పి వస్తుంది. మెడ నొప్పి ఉన్నవారు కొంతమంది మెడ కింద దిండు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది అని అనుకుంటారు. ఇంకా వేడి నీళ్ల కాపడం పెట్టుకున్నా మెడ నొప్పి తగ్గుతుంది. కానీ ఇవి కొంతసమయం మాత్రమే మెడ నొప్పిని తగ్గిస్తాయి.
మెడ నొప్పి పూర్తిగా తగ్గడానికి చిన్న పిల్లలలో ఎలక్ట్రోరల్ వాటర్ తీసుకోవడం, కొబ్బరి నీళ్లు తాగడం, హాట్ బ్యాగ్స్ వాడడం వలన రిలీఫ్ పొందవచ్చు. మధ్య వయసు కలవారు ఎక్కువగా బండి నడిపేవారు, ఎక్కువగా కంప్యూటర్ వర్క్ చేసేవారు, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేవారు నెక్ సపోర్ట్ వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. కంప్యూటర్ మీద వర్క్ చేసేవారు, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేవారు నలభై నిముషాలకు ఒకసారి వారు కూర్చునే భంగిమలను మార్చుకోవాలి. లేదా లేచి ఒకసారి అటూ ఇటూ నడిచి వర్క్ చేయాలి. డైలీ ఉదయం వ్యాయామం చేసేటప్పుడు మెడను నాలుగు వైపులా తిప్పుతూ వ్యాయామం చేయాలి. ఫోన్, కంప్యూటర్ వంగి చూడకూడదు. తలను నిటారుగా ఉంచే చూడాలి.
మెడకు తగినంత రక్త సరఫరా లేకపోయినా మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆస్టియోఫోరోసిస్ అనే సమస్య ఉన్నవారికి కూడా మెడ నొప్పి సమస్య వస్తుంది. అయితే మెడ నొప్పి అనేది అప్పుడప్పుడు వస్తే మనం ఈ పద్దతులను పాటిస్తే సరిపోతుంది. కానీ రోజూ మెడ నొప్పి వస్తూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి.
Also Read : Curd in Summer: ఏంటి.. ప్రతిరోజు పెరుగు తింటే అలాంటి సమస్యలు వస్తాయా?