HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Eating Curd In Summer Dont Do These Mistakes 2

Curd in Summer: ఏంటి.. ప్రతిరోజు పెరుగు తింటే అలాంటి సమస్యలు వస్తాయా?

పెరుగును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చా

  • Author : Anshu Date : 20-08-2023 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Curd In Summer
Curd In Summer

పెరుగును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చాలామంది వేసవి వచ్చింది అంటేచాలు పెరుగు లేదా మజ్జిగను ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. పెరుగు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల అందులో ఉండే కాల్షియం ఎముకలను దంతాలను బలంగా చేస్తుంది. అలాగే పెరుగు కఫం, వాతం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పెరుగు తినడం మంచిదే కదా అని ప్రతి రోజు పెరుగుతుంటే మాత్రం సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

అదేంటి అనుకుంటున్నారా.. మరి పెరుగు ప్రతి రోజు తినడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో పొట్ట ఆరోగ్యంగా, చల్లగా ఉండాలని చాలా మంది పెరుగు తినాలని చెబుతుంటారు. పెరుగు ప్రోబయోటిక్స్, న్యూట్రిషన్‌తో కూడిన ఆహారం. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ఇతర ముఖ్య పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కొంతమందికి పెరుగు తింటే మొటిమలు, స్కిన్ అలర్జీ, జీర్ణ సమస్యలు పెరుగు తిన్న తర్వాత ఎక్కువగా వేడిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పెరుగు తింటే సాధారణంగా శరీరం చల్లబడుతుంది. కానీ, ఇది వేడెక్కడం వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఎండాకాలంలో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బాడీలో కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సాధారణంగా వ్యక్తికి వాత, పిత్త, కఫా దోషాలు ఉంటాయి. అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పెరుగు రుచిలో పుల్లని, వేడిగా ఉంటుంది. జీర్ణం చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది.

ఇది కఫ, పిత్త దోషాలలో ఎక్కువగా ఉంటుంది. వాత దోషంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఏ సీజన్‌లో అయినా, పెరుగు తినేటప్పుడు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. ఎండాకాలంలో పెరుగుని హెల్దీ అని తీసుకుంటారు. దీని వల్ల మొటిమలు, ఇతర సమస్యలు ముఖంపై కనిపిస్తాయి. పెరుగు సరిగ్గా తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉండవు. పెరుగు శరీరంలో వేడి పెంచుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తినొద్దు. కానీ, ఇందులో రాళ్ళ ఉప్పు, కారం, జీలకర్ర వంటివి కలిపి మజ్జిగలా తీసుకోవచ్చు. పెరుగులో నీరు కలిసినప్పుడు అది వేడి ప్రభావాలను బ్యాలెన్స్ చేస్తుంది. నీరు వేడిని తగ్గిస్తుంది. పెరుగుకి శీతలీకరణ ప్రభావాన్నిస్తుంది. కాబట్టి, ఎండల్లో పెరుగుని ఆస్వాదించాలంటే నీటిలో కలి మజ్జిగలా తీసుకోవచ్చు. చాలా మంది వంటలు చేసేటప్పుడు పెరుగుని వేడి చేస్తుంటారు. కానీ, అలా అస్సలు చేయొద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, దీని వల్ల అందులోని గొప్ప గుణాలు తగ్గిపోతాయి. కఫ దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు ఉన్నవారు తగ్గించి తినాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Curd in Summer
  • eating curd
  • problems

Related News

Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. ఆమెను భర్త శివకుమార్ ‘పెరుగు తింటే లావు అవుతావు’ అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను రాజేశ్వరి సీరియస్‌గా తీసుకుని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుక

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd