Health : మందులు లేకుండా కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి…!!
మన జీవనశైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి ఎలాంటి నష్టం ఉండదు.
- By hashtagu Published Date - 09:52 AM, Sun - 2 October 22

మన జీవనశైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ అధిక కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం 200 mg/dL కంటే తక్కువగా ఉండాలి. అంతకు మించి ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) చెడు కొలెస్ట్రాల్ HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు.
చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో, మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవాలి. మీరు పౌష్టిక ఆహారం తీసుకోవడంతోపాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇవే కాకుండా, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఈ సహజ చిట్కాల గురించి తెలుసుకుందాం.
– మీరు ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకుంటే, మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ ధ్యానం, యోగా అలవాటు చేసుకోండి.
– ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధూమపానం చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు దారితీస్తుంది. అదే సమయంలో, మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
-ఆల్కాహాల్ కు దూరంగా ఉండటం మంచిది. అతిగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
– ప్రతి రోజూ వ్యాయామం చేయండి. సహజంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం మంచిది. బరువు పెరగడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
-అధిక కొవ్వు ఉండే పదార్థాలకు దూరంగా ఉండం మంచిది. ప్రాసెస్డ్ చేసిన, నూనెలో వేయించిన ఆహార పదార్ధాలు, అధికంగా చక్కెర ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకండి. దీని వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.