Health Tips: బరువు తగ్గి గుండె పదిలంగా ఉండాలి అంటే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే.. కానీ!
ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె కూడా పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:05 PM, Sat - 15 February 25

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. మంచి మంచి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకున్నప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండెకు సంబంధించిన సమస్యలు అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవి రెండింటిని మెయింటైన్ చేసే ఆహారాల గురించి ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం.. అంటే ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గడంతో పాటు గుండె కూడా పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫైబర్ ఎక్కువగా ఉంది ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆహార పదార్థాలు ఏవి అన్న విషయానికి వస్తే.. బాదం, చియా, అవిసె వంటి గింజలు, ఓట్స్, బీన్స్, బార్లీ, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, కొర్రలు, జొన్నలు, అవకాడో,,బ్రకోలి, క్యారెట్, బ్రస్సెల్స్,మొలకలు, కూరగాయలు, బఠానీలు, పాలకూర, చిరుధాన్యాలు, తాజా పండ్లు, పప్పు ధాన్యాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. కాగా ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారికి ఫైబర్ రిచ్ డైట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఫైబర్ లేదా పీచు పదార్థం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుందట. ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందట. దీంతో ఆకలి అదుపులో ఉంటుందని, దీంతో అతిగా తినాలనే కోరిక కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
అతిగా తినకుండా కంట్రోల్ లో ఉండవచ్చట. ఫైబర్ శరీరం లోని కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుందట. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని, దీంతో బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. ఫైబర్ రిచ్ డైట్ గుండెకు మేలు చేస్తుందట. నీటిలో కరగని ఫైబర్ ఆహారాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయట. సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు ముప్పు కలుగుతుందట. అదే ఫైబర్ రిచ్ డైట్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయట. కరగని ఫైబర్ ఎక్కువగా విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాల్లో లభిస్తుందట. వీటిని డైట్ లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. అయితే ఫైబర్ ఎంత తీసుకోవాలన్నది జీర్ణ వ్యవస్థ పరిమాణం బట్టి ఉంటుందట. పెద్దగా ఉంటే ఎక్కువ ఫైబర్ అవసరం ఉంటుంది. 50 కిలోల బరువు ఉన్నవారికి 20 నుంచి 25 గ్రాముల ఫైబర్ అవసరం. అదే 75 కిలోల బరువుంటే సుమారు 30 నుంచి 35 గ్రాముల ఫైబర్ కావాలి. బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ యోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.