Heart Attacks In Women: మహిళల్లో గుండెపోటు.. కారణాలివే అంటున్న నిపుణులు!
గుండెపోటు ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో 35 సంవత్సరాలు దాటిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- By Gopichand Published Date - 03:15 PM, Sun - 5 October 25

Heart Attacks In Women: సాధారణంగా ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు (Heart Attacks In Women:) మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ గుండెను రక్షించే కవచంలా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవల కాలంలో మహిళల్లోనూ గుండెపోటు మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలి మార్పులు, కొన్ని అలవాట్లే దీనికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గుండెపోటుకు దారితీస్తున్న ప్రధాన కారణాలను వైద్యులు స్పష్టం చేశారు. వాటిలో ముఖ్యమైనవి ఇవే.
అధిక బరువు (స్థూలకాయం): అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు పెరగడం గుండెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
కొలెస్ట్రాల్, బీపీ, షుగర్: అదుపులో లేని అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి సమస్యలు గుండె రక్తనాళాలను దెబ్బతీసి, గుండెపోటుకు దారి తీస్తున్నాయి.
ధూమపానం (పొగ తాగడం): పొగ తాగే అలవాటు గుండెకు అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతోంది.
హార్మోన్ల ప్రభావం: ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోవడానికి (మెనోపాజ్) ఉపయోగించే హార్మోన్ మాత్రల (హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ) వాడకం కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
Also Read: IND W vs PAK W: మరికాసేపట్లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డ్రామా!
గుండెపోటు ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో 35 సంవత్సరాలు దాటిన మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా కొన్ని కచ్చితమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మహిళలు గుండెపోటు ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.