Bone Health: పిల్లలు ఎముకలు దృడంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే?
సాధారణంగా ప్రతి జీవి యొక్క శరీరం ఎముకల నిర్మాణం పై ఆధారపడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాగే
- By Nakshatra Published Date - 07:40 AM, Tue - 6 September 22

సాధారణంగా ప్రతి జీవి యొక్క శరీరం ఎముకల నిర్మాణం పై ఆధారపడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాగే మనిషి శరీరం కూడా ఎముకల పైనే ఆధారపడి ఉంటుంది. ఎముకలు లేకపోతే మనిషి నిటారుగా నిలబడలేదు కూర్చోలేడు. కాబట్టి మనం ఎముకలను బలంగా దృఢంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మంచి మంచి ఆహారాన్ని, సరైన జాగ్రత్తలను పాటించాలి. ఇకపోతే ఎముకలు బలంగా ఉండాలి అంటే వాటికి సరైన క్యాల్షియం అందాలి. ఎముకలకు కావాల్సిన కాల్షియం పాలలో సమృద్ధిగా లభిస్తుంది. పాలు తాగడానికి ఇష్టపడకపోతే అల్పాహారంలో ఓట్స్‌తో పాటు పాలు కలిపి తీసుకోవచ్చు. రోజూ పాలు తీసుకుంటే మీకు కాల్షియం మూడింట ఒక వంతు లభిస్తుంది. శరీరానికి అసలైన నిర్మాణాన్ని ఇచ్చేవి ఎముకలే.
ఇవి బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు అని చెప్పవచ్చు. సాధారణంగా ఎముకలు చిన్న వయసు నుంచి ఏజ్ పెరిగే కొద్ది బలహీనమవుతూ ఉంటాయి. చిన్నపిల్లలకు ఎముకలు బలహీనంగా ఉండగా ఆ తర్వాత ఒక ఏజ్ వరకు ఎముకలు బాగా స్ట్రాంగ్ ఉంటాయి. ఆ తర్వాత వయసు మీద పడే కొద్ది ఎముకల్లో శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే సాధారణంగా చిన్నపిల్లలు ఎముకలు చాలా తెలుసుగా ఉంటాయి అని అంటూ ఉంటారు. అందుకే పిల్లలను ఎలా పడితే అలా ఎత్తుక్కోకూడదు,ఎగిరేయకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
పసి పిల్లల్లో ఎముకలకు తగిన పోషణ అందిస్తే వాళ్లలో ఎదుగుదల బాగుంటుంది. వృద్ధులైతే గాయాలపాలు కాకుండా చూసుకోవచ్చు. మరి పిల్లల్లో ఎముకలు దృఢత్వం కోసం ఎటువంటి ఆహారాలు ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం ఇనుప కడాయిలో వేయించిన నువ్వులను ప్రతిరోజు ఒక టీ స్పూన్ పిల్లలకు తినిపించడం అలవాటు నేర్పించాలి. అలాగే వారానికి మూడు నువ్వుల లడ్డులు తినే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మునగా కూడా రసాన్ని పాలతో కలిపి తాగించాలి. అలాగే పిల్లలు తరచుగా తినే వాటిలో తాటి బెల్లం తప్పక ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా వారానికి రెండు లేదా మూడు సార్లు తోటకూర, మునగాకు లేదంటే ఏదైనా ఇతర ఆకుకూరలను అందించడం మంచిది. ఎండు ఆల్ బుకరా తరచుగా ఇస్తూ ఉండడం మరింత మంచిది.
Related News

Milk History: క్షీర విప్లవం కథ ఈనాటిది కాదు.! వేల ఏళ్ల పోరాటం..!
సుమారు 10 వేల సం.ల క్రితం నుండి మాత్రమే ఈ పెంపుడు జంతువుల పాలకు మానవులు అలవాటు పడ్డారు. ఒక్కొక్కటిగా ఆవు , గేదె , మేక, గొర్రె పాలను ఆహారంలో భాగం గా తీసుకోవడం మొదలు పెట్టారు.