Royal Enfield Classic 350 vs Jawa 350: రాయల్ ఎన్‌ఫీల్డ్-జావా 350.. ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 350 బైక్ లు ఒకదానికొకటి పోటీగా నిలుస్తున్నాయి..
- By Nakshatra Published Date - 12:00 PM, Tue - 3 September 24
రెట్రో థీమ్ మోటార్ సైకిళ్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కూడా ఒకటి. ఈ బైక్ ఇప్పటికే కొత్త కొత్త కలర్స్ తో, కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో ఎన్నో రకాల అప్డేట్స్ తో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇక ముందు ముందు మరిన్ని అప్డేట్ వర్షన్ లతో క్లాసిక్ 350 అమ్మకాలను మరింత పెంచాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్.. జావా 350, హోండా సీబీ 350లతో పోటీ పడుతోంది. 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, జావా 350 బైకులు ఒకదానికొకటి పోటాపోటీగా ఉన్నాయి.
మరి ఈ రెండు బైక్స్ లో ఏది బెస్ట్ అన్న విషయానికి వస్తే.. 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ .1.99 లక్షల నుండి రూ .2.30 లక్షలుగా ఉంది. హెరిటేజ్, హెరిటేజ్ ప్రీమియం, సిగ్నల్స్, డార్క్, క్రోమ్ అనే ఐదు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. ఈ మోటార్ సైకిల్ అనేక రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు జావా 350 నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర రూ .1.99 లక్షల నుండి రూ .2.24 లక్షల మధ్య ఉంది. కాగా ఈ రెండు రెట్రో థీమ్ 350 సీసీ మోటార్ సైకిళ్లు ఒకదానికొకటి చాలా పోటీగా ఉన్నాయి. ఇకపోతే స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ 349 సీసీ జె సిరీస్ సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది.
ఈ ఇంజన్ 6,100 ఆర్‌పీఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పీ పవర్, 4,000 ఆర్‌పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. జావా 350 బైకులో 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 22.26 బిహెచ్‌పీ పవర్, 28.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. క్లాసిక్ 350తో పోలిస్తే జావా 350 కొంచెం మెరుగైన పవర్, టార్క్ అవుట్ పుట్ ను ఇస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 270 ఎంఎం రియర్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో ఉంది. ఈ మోటార్ సైకిల్ 41 ఎంఎం ఫ్రంట్ ఫోర్కు లతో పాటు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్‌ను కలిగి ఉంది. క్లాసిక్ 350లో 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 805 ఎంఎం సీట్ హైట్, 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి.
మరోవైపు జావా 350లో 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 240 ఎంఎం రియర్ డిస్క్ ఉన్నాయి. సస్పెన్షన్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ఇది 35 ఎంఎం ఫ్రంట్ ఫోర్కులతో పాటు ట్విన్ గ్యాస్ నిండిన రియర్ షాక్ అబ్జార్బర్లతో పాటు ఐదు దశల అడ్జస్టబుల్ ప్రీలోడ్ ను పొందుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 178 మిమీ, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13.2 లీటర్లుగా ఉంది. మరి ఈ రెండు రెట్రో బైకుల ఫీచర్ల పరంగా చూసుకొని ఏది బెస్ట్ అన్నది మీరు సెలక్ట్ చేసుకోవచ్చు.
Related News
Vivo T3 Ultra Launch: త్వరలోనే మార్కెట్ లోకి వివో టీ3 అల్ట్రా.. లాంచ్ అయ్యేది అప్పుడే!
వివో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమయింది.