Eating Sweets : స్వీట్ తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం..?
స్వీట్స్ తిన్న వెంటనే మంచినీళ్ళు తాగితే మన ఆరోగ్యానికి మంచిది కాదు.
- By News Desk Published Date - 09:45 PM, Sat - 23 September 23

మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా, పండగైనా లేదా ఏదయినా విశేషం జరిగినా స్వీట్(Sweet) వండుకుంటాము. ఇప్పుడు ఎలాంటి సందర్భం లేకపోయినా బయట షాప్స్ లో తెచ్చుకొని మరీ తింటున్నాము. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా స్వీట్స్ తింటారు. అయితే స్వీట్ తిన్న వెంటనే కొంతమంది మంచినీళ్లు(Water) తాగుతారు.
అలా స్వీట్స్ తిన్న వెంటనే మంచినీళ్ళు తాగితే మన ఆరోగ్యానికి మంచిది కాదు. స్వీట్ తినడం వలన మన శరీరంలో చక్కర స్థాయిలు(Sugar Levels) పెరుగుతాయి. కొందరికి స్వీట్ తిన్న వెంటనే మంచినీళ్ళు తాగాలని అనిపిస్తుంది. కానీ అలా తాగితే అప్పుడు మన రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇక షుగర్ తో బాధపడేవారు స్వీట్ తిన్న వెంటనే మంచి నీళ్ళు తాగితే రక్తంలో చక్కర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి అందరూ స్వీట్ తిన్న వెంటనే నీళ్ళు తాగాలని అనిపిస్తే కంట్రోల్ చేసుకోవాలి. లేదా ఏదైనా హాట్ తిని తాగాలి.
మనం స్వీట్ తిన్న అరగంట లేదా ముప్పావుగంట సమయం తరువాత నీటిని తాగాలి. లేదు నీటిని తాగాలి అనుకుంటే దాని బదులుగా జ్యూస్ లు తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే స్వీట్స్ తినగానే నీళ్లు తాగితే పళ్ళు పుచ్చిపోతాయని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే స్వీట్ తిన్న వెంటనే మంచినీళ్ళు తాగాలి అని అనిపించినప్పుడు ఎక్కువగా నీళ్ళను నోటిలో పోసుకొని పుక్కిలిస్తే అది కూడా మంచిదే.
Also Read : Asthma Patients : వానాకాలంలో ఆస్తమా ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?