FAT : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఇలా చేస్తే ఇట్టే తగ్గిపోందంటున్న డాక్టర్స్
FAT : ముఖ్యంగా చక్కెర తక్కువగా తీసుకోవడం, అధిక శాతం ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మరియు ప్రతిరోజూ తగిన నిద్ర పట్టడం వంటివి బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి
- By Sudheer Published Date - 12:39 PM, Thu - 10 April 25

ఇటీవల చాలా మంది పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు(FAT)తో బాధపడుతున్నారు. వ్యాయామం చేయడం, జిమ్‌కి వెళ్లడం వంటివి సాధ్యం కానప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరిస్తే కొవ్వును తగ్గించుకోవచ్చని డాక్టర్స్ చెపుతున్నారు. ముఖ్యంగా చక్కెర తక్కువగా తీసుకోవడం, అధిక శాతం ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మరియు ప్రతిరోజూ తగిన నిద్ర పట్టడం వంటివి బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్వీట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కు బదులు పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Aadhaar-Voter ID: ఆధార్, ఓటర్ కార్డులను ఎందుకు లింక్ చేయాలి? లింక్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఇక సహజంగా కొవ్వు(FAT)ను కరిగించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని చెపుతున్నారు. ఉదాహరణకి గ్రీన్ టీ, ఆపిల్ సైడర్ వెనిగర్, ఒమేగా-3 చేపలు, మిరపకాయలలోని క్యాప్సైసిన్, గుడ్లు, గింజలు, ఆలివ్ ఆయిల్ వంటివి ఫ్యాట్ బర్న్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తాయి. ఇవి శరీరంలో జీవక్రియను మెరుగుపరచి, పొట్టపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే డైట్‌లో చిరుతిండ్లను తగ్గించి, సమతుల్య భోజనాలను కలిపి తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
తగినంత నీరు (Water) తాగడం, 8 గంటల నిద్ర పడటం వంటి చిన్నపాటి జీవనశైలి మార్పులు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటంతో జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అలాగే రోజూ కొద్దిగా అయినా వాకింగ్, యోగా వంటివి చేయడం వల్ల ఫలితాలు త్వరగా కనపడతాయి. ఇక ఎంతకైనా ముందుగా మనం మన ఆరోగ్యాన్ని ప్రేమించాలి, జీవనశైలిలో మెల్లగా మార్పులు చేస్తూ బరువు తగ్గించుకోవచ్చు అని చెపుతున్నారు.