White Onion Benefits : తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
ఎర్ర ఉల్లిపాయ మాత్రమే కాకుండా తెల్ల ఉల్లిపాయలు (White Onion) కూడా అప్పుడప్పుడు మార్కెట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి.
- By Naresh Kumar Published Date - 09:00 PM, Mon - 25 December 23

Benefits of White Onion : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను వినే ఉంటాం. ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఉల్లిపాయ లేకుండా చాలా రకాల వంటలు పూర్తి కావు. అయితే మనకు మార్కెట్లో ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలు లభిస్తూ ఉంటాయి. వీటినే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎర్ర ఉల్లిపాయ మాత్రమే కాకుండా తెల్ల ఉల్లిపాయలు (White Onion) కూడా అప్పుడప్పుడు మార్కెట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది మంచిది దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలిగే ఉంటుంది. మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
తెల్ల ఉల్లిపాయలలో (White Onion) యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే ముక్కుకు, చెవికి, కంటికి ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ ఉల్లిపాయను తీసుకోవడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల ఉల్లిపాయలు పోషకాలతో నిండి ఉంటాయి. ఈ ఉల్లిపాయలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలు శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావంతం చేస్తూ ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలు తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్లను నుంచి బయటపడవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేస్తుంది.
అలాగే ఫ్లేవర్ నైట్ సల్ఫర్ ఆంటీ ఆక్సిడెంట్లు ఈ ఉల్లిపాయలో అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడడానికి ఉపయోగపడతాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి అనేక ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేయడానికి ఈ ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయలు యాంటీ ఇన్ఫ్లోమేటరీ ఆంటీ కార్డ్స్ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తెల్ల ఉల్లిపాయలు మీ జుట్టుకి కూడా చాలా మేలు చేస్తూ ఉంటాయి. ఈ ఉల్లిపాయ రసం తీసి జుట్టుకు నూనెల అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా నెలపాటు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చలికాలంలో ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం అనే సమస్య ఉంటుంది. దీని వలన చాలామంది మహిళలు బాధపడుతూ ఉంటారు. కాబట్టి తెల్ల ఉల్లిపాయ రసాన్ని జుట్టుకి అప్లై చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల ఉల్లిపాయల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వలన శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోతాయి. దీంతోపాటు తెల్ల ఉల్లిని తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి.
Also Read: Miriyala Chekkalu: ఎంతో క్రిస్పీగా ఉండే మిరియాల చెక్కలు.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు?