Banana Benefits: అరటిపండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా
ప్రతిరోజూ తినే పండ్లలో అరటిపండ్లు ఒకటి. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.
- By Balu J Published Date - 04:41 PM, Tue - 17 October 23

Banana Benefits: ప్రతిరోజూ తినే పండ్లలో అరటిపండ్లు ఒకటి. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండల్లో అరటి పండు ఒకటి. అరటి కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ పొటాషియం అధిక రక్తపోటును తగ్గించి గుండెను సేఫ్ గా ఉంచుతుంది. ఒక మీడియం సైజ్ అరటిపండు మన రోజువారీ పొటాషియం అవసరంలో 10 శాతం అందిస్తుంది. అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పండని అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 ఉంటుంది.
అదే పండిన అరటిలో అయితే ఈ విలువ 60గా ఉంటుంది. దీన్ని తిన్నంత మాత్రాన రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోవు. మధుమేహులు అరటి పండ్లను ఎలాంటి భయాలు లేకుండా తినొచ్చు. అయితే బాగా పండిన అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. అరటిపండ్లలో డోపామైన్, కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు కాదు ఈ పండ్లలో కరిగే, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్స్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి.