Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
- Author : Vamsi Chowdary Korata
Date : 18-06-2026 - 11:31 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్పటికి మంచిదే అనిపించినప్పటికీ, కాలక్రమేణా ఇది అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మనిషికి నిద్ర తక్కువైతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయట.
మరి రాత్రి సమయంలో తక్కువగా నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తి ఎలాంటి మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందట. దీని కారణంగా మీరు అనేక రకాల ఇన్ఫెక్షన్లను కూడా పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనితో పాటు, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుందట. మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందట.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయట. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. చిన్న చిన్న వాటికే కోపం, చిరాకు పెరుగుతాయట. ముఖ్యంగా కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖంపై ముడతలు కనిపిస్తాయని చెబుతున్నారు. మరి రోజులో ఎంతసేపు నిద్రపోవాలి అన్న విషయానికి వస్తే.. మనిషి సగటున ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలని చెబుతున్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఎలాంటి సమస్యలు కూడా దరి చేరవని చెబుతున్నారు. రాత్రిళ్ళు ఒక గంట తర్వాత పడుకుని, ఉదయం 10 గంటలకు లేచినా అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.