HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Can Sugar Patients Eat Jaggery

Sugar Patients: షుగర్ పేషెంట్స్ బెల్లం తినొచ్చా?

డయాబెటిస్ పేషెంట్స్‌ని చూసినప్పుడు మనం మొదటగా వారిని అడిగేది చక్కెర ఎక్కువగా తింటారా అని.

  • By Maheswara Rao Nadella Published Date - 06:30 PM, Thu - 1 December 22
  • daily-hunt
Dia
Dia

డయాబెటిస్ పేషెంట్స్‌ని చూసినప్పుడు మనం మొదటగా వారిని అడిగేది చక్కెర ఎక్కువగా తింటారా అని. దీని బదులు బెల్లం, తేనె తినొచ్చు అని చెబుతారు చాలా మంది. బెల్లం, తేనె షుగర్ పేషెంట్స్‌కి మంచివని చెబుతారు. ఎందుకంటే ఇవి సహజ రూపంలో దొరుకుతాయి. ఇలా సహజంగా దొరికిన బెల్లం, తేనె తీసుకోవడం మంచిది. టొరంటో యూనిర్శిటీ పరిశోధకులు చేసిన ఓ పరిశోధన అధ్యయనంలో పచ్చి తేనె తీసుకుంటే శరీరానికి కార్డియో మెటబాలిక్ ప్రయోజనాలు ఉన్నాయని, అంటే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి షుగర్ వంటి సమస్యల్ని తగ్గిస్తుందని తేలింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న 1,105 మందిని పరీక్షించిన పరిశోధకులు తేనెలో ఐసోమాల్టులోజ్, కోజిబియోస్, ట్రెహాలోస్, మెలిజిటోస్ వంటి అరుదైన చక్కెర్లు గ్లూకోజ్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తాయని చెప్పారు.

నేచురల్ షుగర్‌కే డిమాండ్:

Jaggery: Health benefits of this superfood that you must know about

ప్రాసెస్ షుగర్ కంటే సహజంగా లభించే తీపి పదార్థాలకి నేడు డిమాండ్ పెరుగుతుంది. నిజంగానే సహజ చక్కెర జీవక్రియ ఆరోగ్యంపై ఏమైనా ప్రభావం చూపుతుందా.. అన్న ప్రశ్నకు హార్వర్డ్ నివేదిక ప్రకారం సహజమైన, ప్రాసెస్డ్ షుగర్ బాడీలో ఒకే విధంగా జీవక్రియలో పాల్గొంటాయి. కానీ, చాలా మందికి పండ్ల వంటి ఆహారాలలో సహజ చక్కెర్లు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే, చక్కెర మొత్తం సహజంగా, ఫైబర్, ఇతర పోషకాలతో ప్యాక్ చేయబడి ఉంటుంది. మరోవైపు చక్కెరతో తయారైన ఫుడ్స్ తినడం వల్ల మన బాడీకి ఎలాంటి ఉపయోగం ఉండదు.

డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే:

Research Story Tip: Study Says Doctors Should Discuss Hypoglycemia More Often with Patients Who Have Diabetes

బెల్లం చక్కెర కంటే రసాయనికంగా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇది సుక్రోజ్ యొక్క పొడవైన గొలుసులను కలిగి ఉంటుందని డాక్టర్ అశోక్ కుమార్ జింగన్ వివరించారు. ఈయన న్యూఢిల్లీలోని BLK Max సెంటర్ ఫర్ డయాబెటిస్, థైరాయిడ్, ఒబేసిటీ అండ్ ఎండోక్రినాలజీ, BLK Max సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సీనియర్ డైరెక్టర్‌గా ఉన్నారు. డాక్టర్ జింగన్ మాట్లాడుతూ శుధ్ధి చేసిన తెల్ల చక్కెర స్థానంలో బెల్లం వాడడం వల్ల ఓ వ్యక్తి ఆహారంలో కనీస మొత్తంలో అదనపు పోషకాలు జోడించబడతాయి. అయినప్పటికీ, ఓ వ్యక్తి తమ పోషకాలు తీసుకోవడం పెంచడానికి ఆహారంలో ఎక్కువ బెల్లం వాడొద్దు. విటమిన్లు, ఖనిజాలను తక్కువ కేలరీల మూలాల నుండి పొందడం మంచిది.

బెల్లం తింటే లాభాలు:

These health benefits of jaggery make it a good alternative for sugar | HealthShots

బెల్లం వంటి సహజ చక్కెరపై డాక్టర్ జింగన్ బెల్లం లేదా గుర్ సాంప్రదాయ స్విటెనర్ అని అనేక ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో విస్తృతంగా వాడుతున్నారు ఎందుకంటే, శుద్ధి చేయలేదు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో పోషకాలను కలిగి ఉంటుంది. బెల్లం ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తపోటుని కూడా నియంత్రిస్తుంది. కాబట్టి, శుద్ధి చేసిన చక్కెరను ఎక్కువ విటమిన్లు, ఖనిజాజాలు ఉన్న స్వీటెనర్‌ని భర్తీ చేయడం మంచిది. అయినప్పటికీ మీ ఫుడ్‌లో బెల్లం ఎక్కువగా వాడడం అంత మంచిది కాదు.

షుగర్ పేషెంట్స్ ఏం తినాలంటే:

Diabetes and Teeth | MouthHealthy - Oral Health Information from the ADA

గ్లైసెమిక్ ఇండెక్స్ లేదా జీఐ అనేది కార్బోహైడ్రేట్స్‌ని కలిగి ఉన్న ఆహారాలకు రేటింగ్ సిస్టమ్. ఆహార గ్లైసెమిక్ సూచిక మీ రక్తంలో చక్కెర స్థాయిని ఎలా గందరగోళానికి గురిచేస్తుందో తెలుపుతుంది. జీఐని అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే, తక్కువ జీఐ ఉన్న ఆహారాలు నెమ్మదిగా, స్థిరంగా గ్లూకోజ్‌ని విడుదల చేస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నవి వేగంగా గ్లూకోజ్‌ని విడుదల చేస్తాయి. షుగర్ ఉన్నవారు ఎప్పుడూ తక్కువ జీఐ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తారు. బెల్లం జీఐ దాదాపుగా శుద్ధి చేసిన చక్కెరను పోలి ఉంటుంది. తేనె జీఐ దాని కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే వేర్వేరు తేనెలు వేర్వేరు జీఐలను కలిగి ఉంటాయి.

చక్కెర, బెల్లం రెండూ చెరుకు నుంచే:

ఈ రోజుల్లో ప్రాసెస్ వాటి కంటే సహజ చక్కెర వినియోగంపై అహ్మదాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ ఎండోక్రినాలజీ అండ్ డయాబెటిస్ విభాగాధిపతి డాక్టర్ రమేష్ గోయల్ మాట్లాడుతూ షుగర్ పేషెంట్స్‌కి చక్కెరకు బెల్లం మంచి ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. ఎందుకంటే బెల్లంలోని గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహార పదార్థం మీ గ్లూకోజ్ స్థాయిని ఎలా ప్రభావితం చేస్తుందో సూచించే సూచిక. బెల్లం తినే షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిని కలిగి ఉంటాడు. వారు చక్కెర తినడం నుండి మనం ఆశించే స్థాయిలోనే ఉంటుంది. చక్కెరకు బెల్లం మంచి ప్రత్యామ్నాయం అనే ఊహ సరికాదని, ఇవి రెండూ కూడా చెరకు నుంచే వస్తాయని డాక్టర్ జింగన్ చెబుతున్నారు. అందువల్ల ఇది ఆల్టర్నేటివ్ అని కాదని చెబుతున్నారు.

బెల్లం తినే ముందు:

బెల్లాన్ని ఇలా తీసుకుంటే ప్రయోజనాలెన్నో

చక్కెర బదులు బెల్లం తినడం మధుమేహం ఉన్న రోగులకు అంత మంచిది కాదు. అయితే, బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్, మెగ్నీషియం లెవల్స్ పెరుగుతాయి. మీ హిమోగ్లోబిన్‌కి మంచిది. అది కూడా షుగర్ లేనివారికి మాత్రమేనని డాక్టర్ చెబుతున్నాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • doctor
  • health
  • jaggery
  • Life Style
  • sugar
  • Sugar cane
  • Sugar Patients

Related News

Sugar Control

Sugar Control : మెడిసిన్ వాడుతున్న షుగర్ కంట్రోల్ అవ్వడం లేదా? ఈ ఆకును ఒక నెల తింటే చాలు!

Sugar control : భారతీయ సంస్కృతిలో, తమలపాకు (Betel leaf) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం శుభకార్యాల్లోనే కాకుండా, ఆయుర్వేద వైద్యంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

    Latest News

    • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

    • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

    • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

    • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

    • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd