HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Mangoes In Summer

Mangoes : సమ్మర్ స్పెషల్ మామిడి పండ్లు.. తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

రోజుకొకటి లేదా రెండు మామిడి పండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వేసవిలో మామిడి పండ్లు తినడం వల్ల అందం, ఆరోగ్యాన్ని(Health) కాపాడుకోవచ్చు.

  • Author : hashtagu Date : 23-04-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Benefits of Mangoes in Summer
Benefits of Mangoes in Summer

పండ్లకు రారాజు మామిడి పండు. ప్రత్యేకంగా వేసవిలో(Summer) వచ్చే మామిడి పండ్లకే (Mangoes)రుచి ఎక్కువ. అందుకే వేసవిలో మ్యాంగో లవర్స్ ఎప్పుడెప్పుడు మామిడి పండ్లు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అయితే మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని, సెగెడ్డలు వంటివి వస్తాయని చాలామంది భయపడతారు. అలా ఎఫెక్ట్ అయ్యేది మామిడిపండ్లు అతిగా తినేవారికి. రోజుకొకటి లేదా రెండు మామిడి పండ్లు తినడం వల్ల అలాంటివేమీ ఉండవు. చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వేసవిలో మామిడి పండ్లు తినడం వల్ల అందం, ఆరోగ్యాన్ని(Health) కాపాడుకోవచ్చు.

మామిడి పండ్లు తినడం వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది. చర్మంపై ముడతలు, నల్లమచ్చలు తొలగుతాయి. అలాగే సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలను తట్టుకునే సామర్థ్యాన్ని మామిడి పండ్లు అందిస్తాయి.

వీటిలో ఉండే విటమిన్ బి6 చర్మంలోని సెబమ్ ను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం చర్మానికి తేమను అందిస్తుంది. మెగ్నీషియం మొటిమలను తగ్గించి, చర్మం జిడ్డుగా లేకుండా సంరక్షిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు నుండి కూడా కాపాడుతాయి.

మామిడి పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నోరాటిరియోలా, రెస్వెరాట్రాల్, మాంగిఫెరిన్, క్వెర్సెటిన్ లు యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

మామిడి పండ్లనుండి గుజ్జు తీసి దానిని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల వల్ల కలిగే మంట తగ్గుతుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్ సి, ఫైబర్ శరీరానికి హానిచేసే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

మామిడి పండ్లలో ఉండే కాపర్ వల్ల ఎర్రరక్తకణాలు వృద్ధి చెందుతాయి. వీటిలో లభించే ఐరన్.. రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే బిటాకెరోటిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మామిడి పండ్లలో విటమిన్ సి తో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, ప్రొటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండెజబ్బులు రాకుండా కాపాడుతాయి. అందుకే కచ్చితంగా సమ్మర్ వస్తే మామిడిపండ్లు తినండి.

 

Also Read :   Milk: వామ్మో.. పాలు తాగడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefits of Mangoes in Summer
  • health tips
  • mango
  • mangoes
  • summer
  • summer tips

Related News

If belly fat is increasing, it means this hormone is high!

Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం. హార్

  • Struggling with work stress? Here’s how to relax!

    Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

Latest News

  • Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

  • Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Trending News

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd