Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..
బిజీ జీవనశైలి, తప్పుడు ఆహారం కారణంగా చాలామంది ప్రజలు కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు.
- By Hashtag U Published Date - 07:00 PM, Wed - 25 January 23

బిజీ జీవనశైలి, తప్పుడు ఆహారం కారణంగా చాలామంది ప్రజలు కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే మైనం లాంటి పదార్థం. సాధారణంగా మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ , చెడు కొలెస్ట్రాల్ అనే 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మన ధమనులను శుభ్రంగా ఉంచుతుంది. తద్వారా గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అదే సమయంలో, చెడు కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనది.దాని స్థాయి పెరిగినప్పుడు ధమనులలో గడ్డకట్టడం మొదలవుతుంది.దీని కారణంగా గుండెకు వెళ్లే రక్త ప్రవాహం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ వంటివి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. కొన్ని పండ్లలో ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు. అలాంటి ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* అవకాడో
రక్తపోటు రోగులు తప్పనిసరిగా అవకాడో తినాలి. అవకాడోలో విటమిన్లు K, C, B5, B6, E, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. అవకాడో శరీరంలోని మంచి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నిర్వహిస్తుంది.
* టొమాటో
టొమాటోలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ, బి, కె, సి ఇందులో ఉంటాయి. ఇవి చర్మం, కళ్ళు, గుండెకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతాయి వీటిలో పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటు , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* యాపిల్
వైద్యులు రోజూ ఒక యాపిల్ తినాలని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే దీనిని తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. పెక్టిన్ అనే ఫైబర్ యాపిల్‌లో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఇది గుండె కండరాలు, రక్త కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
* సిట్రస్ పండ్లు
నిమ్మ, సంత్రాలు, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు కూడా మీ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో హెస్పెరిడిన్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటు, స్ట్రోక్ , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది కాకుండా, సిట్రస్ పండ్లను తీసుకోవడం ద్వారా మహిళల్లో స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.
* బొప్పాయి
బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. రక్తపోటును నియంత్రించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఒక పెద్ద బొప్పాయిలో 13 నుంచి 14 గ్రాముల ఫైబర్ ఉంటుంది. రోజూ బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
Related News

APPLE: బాబోయ్.. ఈ కంప్యూటర్ మౌస్ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రపంచంలో ఎక్కువ మంది లవ్ చేసే మెుబైల్ ఏదైనా ఉందంటే ఆపిల్.