Eye Care: కంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే టిప్స్ ఫాలోకండి
రోజురోజుకూ కంటి సమస్యలు పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.
- By Balu J Published Date - 01:22 PM, Fri - 24 November 23

Eye Care: రోజురోజుకూ కంటి సమస్యలు పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది కంటి సమస్యలతో బాధపడుతూ అంధత్వం బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 28.5 కోట్ల మంది దృష్టి లోపాలతో బాధపడుతుండగా, 3.9 కోట్ల మంది అంధత్వంతో బాధపడుతున్నట్టు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒత్తిడిని మటుమాయం చేసే నిర్ధిష్ట వ్యాయామాలతో కంటి వ్యాధులు దరిచేరకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది.
మన వయసు పెరిగే కొద్దీ కండ్లు అనేక వ్యాధుల బారినపడే ముప్పు అధికమవుతుంది. వయసు మీదపడే క్రమంలో వయో సంబంధ మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ), క్యాటరాక్ట్స్, డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా సహా దృష్టి లోపాల వంటి పలు కంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఈ తరహా ముప్పులను నియంత్రించవచ్చని, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ వెల్లడించింది.
నిలకడగా వర్కవుట్స్ చేయడం కొనసాగించే వ్యక్తుల్లో కంటి సమస్యలతో తలెత్తే లక్షణాలు గణనీయంగా తగ్గాయని పరిశోధణల్లో స్పష్టమైందని చెబుతున్నారు. కండ్లు పొడిబారే సమస్య నుంచి సైతం నిత్యం వ్యాయామం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని వెల్లడైంది. గడియారం మాదిరిగా కళ్లను తిప్పుతూ, కిందికి పైకి చూస్తూ వ్యాయమాలు చేయడం వల్ల కూడా సమస్యలను అధిగమించవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.