Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే…
వర్షాకాలం, శీతాకాలంలో చాలామంది ఈ అల్లం టీ (Ginger Tea)ని తాగడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
- Author : Naresh Kumar
Date : 07-12-2023 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
Drinking Ginger Tea too much? : చాలామందికి అల్లం టీ లేదా అల్లం పాలు అంటే చాలా ఇష్టం. మరికొందరికి కేవలం జలుబు చేసిన సమయంలో లేదంటే చలికాలంలో మాత్రమే వీటిని తాగుతూ ఉంటారు.. అయితే అల్లం టీ (Ginger Tea) టేస్ట్ బాగుందని హెల్త్ కూడా చాలా మంచిది అని చాలామంది తెగ తాగేస్తూ ఉంటారు. అలాంటి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. మరి అల్లం టీ ని ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనకు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
మాములుగా బాగా జలుబు, దగ్గు ఉన్న అల్లం టీని (Ginger Tea) తాగుతూ ఉంటారు. ఆ సమయంలో మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే వర్షాకాలం, శీతాకాలంలో చాలామంది ఈ అల్లం టీ ని తాగడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అల్లం లో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి. అల్లం లోని ఈ గుణాలు రక్తస్రావాన్ని కలిగిస్తాయి. చాలామంది నల్ల మిరియాలు, లవంగాలు లాంటి మసాలా దినుసులు వేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన మరిన్ని సమస్యలు వస్తాయి. అల్లం తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఇది మేలు చేస్తుంది. అల్లం ఎక్కువగా తీసుకుంటే ఉదర సంబందిత సమస్యలు కూడా వస్తాయి. అలాంటి ఎక్కువగా తీసుకోవడం వలన డయేరియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీర్ణ కోసం వ్యాధులు వచ్చి ప్రమాదం ఉంటుంది.
కావున అల్లం తో తయారు చేసిన టీ ని ఎక్కువగా తాగడం మానుకోవాలి. అల్లం పరిమిత పరిమాణంలో తీసుకుంటే దాని వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ రుచి కోసం అవసరానికి మించి అల్లం తీసుకోవడం వలన గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అల్లం ఎక్కువుగా తీసుకుంటే, దాని వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ అవసరానికి మించి ఎక్కువ అల్లం తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. అల్లం టీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదాలు ఉంటాయి.