Belly Fat: వారం రోజుల్లోనే పొట్ట ఈజీగా కరిగిపోవాలంటే ఈ మూడు పనులు చేయాల్సిందే.. అవేటంటే!
ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రకాల పనులు చేస్తే వారం రోజుల్లోనే ఈజీగా అధిక పొట్ట కరిగిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:01 PM, Mon - 26 May 25

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా స్వతహాగా వారి పనులు వారు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వారు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల వ్యాయామాలు చేస్తే ఈజీగా పొట్ట కరిగిపోతుందని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒక వారం పాటు నిరంతరం వ్యాయామం చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వవచ్చు అని చెబుతున్నారు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి నిద్ర వంటి జీవనశైలి మార్పులను దీర్ఘకాలం పాటించాలట. వాకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం వంటివి కూడా పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. కాగా ఈ వ్యాయామాన్ని రెండు విధాలుగా చేయవచ్చట. ఇందుకోసం ముందుగా ఎడమ కాలిని పక్కకు తీసుకెళ్లి మళ్లీ యధాస్థితికి తీసుకురావాలి. అదే సమయంలో రెండు చేతులను తలపైకి ఎత్తాలి. ప్రతిసారీ కాలిని పక్కకు ఉంచినప్పుడు ఒక చేతిని పైకి ఎత్తాలి. దీన్ని వేగంగా చేయాలి.ఒక సెట్ కు 30 చొప్పున 3 సెట్ లు చేయవచ్చట. అలాగే పొట్ట కొవ్వును తగ్గించడానికి ఉత్తమ మార్గాల్లో హై నీస్ కూడా ఒకటి. దీన్ని కూడా దూకి చేయవచ్చు లేదా నిలబడి కాలిని పైకి ఎత్తవచ్చట.
ఒక్కో కాలిని 15 సార్లు ఎత్తాలి. ఒక సెట్ లో 30 సార్లు రెండు కాళ్లను ఎత్తవచ్చట. ఇవి మూడు సెట్ లు చేయవచ్చని చేయవచ్చని చెబుతున్నారు. పొట్ట కొవ్వు తగ్గించడానికి బర్ఫిస్ అనే ఒక్క వ్యాయామం కూడా సరిపోతుందట. రోజుకు 100 బర్పీస్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయట. శరీరంలోని కేలరీలు వేగంగా కరుగుతాయని, 10 బర్పీస్ చేయడం 30 సెకన్ల పాటు వేగంగా పరిగెత్తడంతో సమానం అని చెబుతున్నారు. కాగా ఈ వ్యాయామానికి ముందుగా ప్లాంక్ పొజిషన్ లో నిలబడాలట. దీంతో పాటు స్క్వాట్, పుష్ అప్ లు కూడా ఉంటాయని,పొట్ట కొవ్వును తగ్గించడానికి ఇది ఉత్తమ వ్యాయామం అని చెబుతున్నారు. అదేవిధంగా ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినాలట. కార్బోహైడ్రేట్లను తగ్గించాలట. ప్రోటీన్ ఆహారాలు బరువు తగ్గడానికి కండరాల పెరుగుదలకు సహాయపడతాయని చెబుతున్నారు. పొట్ట కొవ్వు తగ్గాలంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, వేపుళ్లు మానేయాలట. నీళ్లు బాగా తాగాలట. వీటితో పాటుగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని చెబుతున్నారు.