HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >13 Health Tips For Healthy Life Style

Health Tips : ఈ 13 ఆరోగ్య సూత్రాలు పాటిస్తే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం

భోజనం తినేటపుడు కింద కూర్చుని తినాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం భోజనంలో తినే కూరల్లో వాముపొడిని వాడాలి.

  • Author : News Desk Date : 21-10-2023 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Climate Change Effect
Climate Change Effect

Health Tips : మనిషి దీర్ఘకాలంపాటు జీవించాలంటే.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో.. జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడి.. ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకుంటున్నారు. కానీ.. ఈ 13 ఆరోగ్య సూత్రాలను పాటిస్తే.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం.

  • 13 ఆరోగ్య సూత్రాల్లో మొదటిది.. ఉదయాన్నే నిద్రలేవడం. ఉదయం 4.30 గంటలకే నిద్రలేచి, నోరు పుక్కిలించి ఒకగ్లాసు గోరు వెచ్చని నీరు నెమ్మదిగా తాగాలి.
  • ఆ తర్వాత ఒక గంట సమయంపాటు శరీరం, శ్వాస వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, యోగా చేయాలి. ఇవ్వన్నీ పూర్తయ్యాక గోరువెచ్చని నీటితో లేదా.. చన్నీటితో స్నానం చేయాలి.
  • ఉదయం 8.30 గంటలలోపే అల్పాహారం తినాలి. వాటిలో పండ్లు, పండ్లరసం ఉండాలి. టిఫిన్ చేసిన వెంటనే పని చేసుకోవాలి.
  • మధ్యాహ్నం లోగా 2-3 గ్లాసుల మంచినీరు త్రాగాలి. 48 నిమిషాల్లో భోజనం చేస్తారనగా.. మరో గ్లాస్ మంచినీళ్లు తాగాలి.
  • భోజనం తినేటపుడు కింద కూర్చుని తినాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం భోజనంలో తినే కూరల్లో వాముపొడిని వాడాలి.
  • భోజనం తర్వాత మరిచిపోకుండా ఒక్కగ్లాసు మంచినీరు తాగాలి. 30-40 నిమిషాల పాటు రిలాక్స్ అయి.. మళ్లీ పని చేసుకోవాలి.
  • సూర్యాస్తమయంలోగా రాత్రి భోజనం పూర్తి చేసి.. కనీసం ఒక కిలోమీటరైనా నడవాలి.
  • భోజనం చేసిన గంట తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి. ఎట్టి పరిస్థితిలోనూ 9 గంటల తర్వాత మేల్కొని ఉండకూడదు.
  • అలాగే.. రాత్రి తినే ఆహారంలో.. పెరుగు, మజ్జిగ, పుల్లటిపండ్లు, సలాడ్ వంటి వాటిని తినకూడదు. ఆహారంలో చక్కెర, ఉప్పు, మైదా వీలైనంత వరకూ తీసుకోకపోవడం మంచిది. చాలా తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి.
  • పాలు తాగినపుడు అందులో కొద్దిగా పసుపువేసి మరిగించి తాగితే.. క్యాన్సర్ వంటి వ్యాధి వచ్చే శాతం తగ్గుతుంది.
  • ఫ్రిడ్జ్ లో పెట్టిన పండ్లు, కూరగాయలు, పదార్థాలను.. అందులో నుంచి తీసిన గంట తర్వాతే తినాలి. ఏ ఆహారమైనా వండిన 40 నిమిషాల్లోపే తినేయాలి.
  • మార్చ్ నుంచి జూన్ మధ్యకాలం (ఎండాకాలం)లో మట్టిపాత్రలో ఉంచిన నీరు తాగాలి. జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్యకాలం (వర్షాకాలం)లో రాగిపాత్రలో నిల్వచేసిన నీటిని తాగాలి.
  • ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, మద్యం, ధూమపానాలకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 13 health tips
  • health tips
  • healthy life
  • healthy lifestyle

Related News

If belly fat is increasing, it means this hormone is high!

Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం. హార్

  • Struggling with work stress? Here’s how to relax!

    Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

Latest News

  • Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

  • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • Toxic: ‘టాక్సిక్’ నుండి ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్ విడుదల!

  • Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • IND Vs ENG: నేటి నుంచే భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టీ20 సిరీస్‌

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd