HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Fact Check
  • >Fact Check Indian Govt Bans Paper Currency From Feb 1 Switches To Digital Money

Fact Check : ఫిబ్రవరి 1 నుంచి పేపర్ కరెన్సీ బ్యాన్.. ఆ న్యూస్ క్లిప్‌లో నిజమెంత ?

ఒక X వినియోగదారుడు ఆ పేపర్ క్లిప్పింగ్‌లలో ఒకదాన్ని షేర్ చేస్తూ.. “ఫిబ్రవరి 1 నుంచి భారత ప్రభుత్వం పేపర్ కరెన్సీని(Fact Check) నిషేధిస్తున్నది.

  • By Pasha Published Date - 07:34 PM, Sat - 25 January 25
  • daily-hunt
Fact Check Indian Govt Paper Currency Ban Digital Money Digital Currency Kerala

Fact Checked By newsmeter

ప్రచారం : 2025 ఫిబ్రవరి నుంచి భారతదేశంలో పేపర్ కరెన్సీ స్థానంలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తుంది. 

వాస్తవం: ఆ ప్రచారం తప్పు. ఆ వైరల్ క్లిప్పింగ్ ఒక పత్రికా ప్రకటన(యాడ్). దీన్ని వివిధ కేరళ వార్తాపత్రికలు ప్రచురించాయి.  కొచ్చిలోని జైన్ డీమ్డ్-టు-బి విశ్వవిద్యాలయం నిర్వహించే విద్యార్థుల సదస్సు కోసం ఈ వెరైటీ ప్రకటన ఇచ్చారు. 

Also Read :Asif Bashir : భారతీయులను కాపాడిన పాక్‌ అధికారికి అత్యున్నత పురస్కారం

‘‘భారత ప్రభుత్వం పేపర్ కరెన్సీని రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుంది’’ అంటూ మలయాళ పత్రికల్లో ప్రచురితమైన కథనంతో కూడిన పేపర్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక X వినియోగదారుడు ఆ పేపర్ క్లిప్పింగ్‌లలో ఒకదాన్ని షేర్ చేస్తూ.. “ఫిబ్రవరి 1 నుంచి భారత ప్రభుత్వం పేపర్ కరెన్సీని(Fact Check) నిషేధిస్తున్నది. డిజిటల్ కరెన్సీ మాత్రమే ఇక అనుమతించబడుతుంది అనే వార్తలతో మలయాళ మీడియా నిండిపోయింది” అని రాసుకొచ్చాడు. ( ఆర్కైవ్ )

Facebookలో మలయాళంలో ఉన్న ఇలాంటి క్లెయిమ్‌లను ఇక్కడ మరియు ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ( ఆర్కైవ్ )

వైరల్ క్లిప్‌లో ఇంకా ఏముంది ?

‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి భారతదేశంలో అన్ని ద్రవ్య లావాదేవీలు డిజిటల్ కరెన్సీ ద్వారా నిర్వహించబడతాయి’’ అని ఆ పేపర్ క్లిప్పింగ్‌లలో ప్రస్తావించారు. ‘‘ ఫిజికల్ కరెన్సీ (పేపర్ నోట్స్)ని దశలవారీగా ఉపసంహరిస్తారు. నగదు ఉన్నవారు తమ నగదును బ్యాంకుల ద్వారా డిజిటల్ కరెన్సీగా మార్చుకోవడానికి ఫిబ్రవరి 15 వరకు సమయం ఇస్తారు. నల్లధనాన్ని నిర్మూలించడం, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే ఈ చర్య. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వానికి అధిక నియంత్రణను అందించడం దీని లక్ష్యం’’ అని ఆ పేపర్ క్లిప్‌లో ఉంది.

‘‘ఈ విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక శక్తిగా నిలబెడుతుంది. ‘డిజిటల్ ఇండియా’ చొరవకు పరాకాష్టగా నిలుస్తుంది’’ అని క్లిప్పింగ్‌‌లో ఉంది. ‘‘ఈ పరివర్తన దేశ ఆర్థిక భద్రతను పెంపొందిస్తుంది. భవిష్యత్తు వృద్ధికి తోడ్పడుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నట్లు ఆ వైరల్ క్లిప్‌లో ఉంది.

వాస్తవ తనిఖీలో ఏం తేలింది ?

  • ఈ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది. ఈ  వైరల్ పేపర్ క్లిప్పింగ్‌లు పత్రికా ప్రకటనలు. వీటిని కేరళ వార్తా పత్రికలలోని మార్కెటింగ్ ఫీచర్ విభాగంలో  ప్రచురించినట్లు మేం గుర్తించాం.
  • పేపర్ క్లిప్పింగ్స్‌లో పేర్కొన్న కొన్ని పేర్లు, క్లెయిమ్‌లు నిజమా అనే సందేహాన్ని లేవనెత్తాయి. ఆర్‌బీఐ గవర్నర్‌గా డాక్టర్ అరవింద్ కుమార్, కేంద్ర ఆర్థిక మంత్రిగా రాజీవ్ సింగ్, ప్రతిపక్ష నేతగా డాక్టర్ అంజలీ మెహ్రా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి వీరిలో ఎవరికీ ఆ పదవులు లేవు.
  • ఈ  క్లిప్పింగ్‌‌లో నోబెల్ గ్రహీత డాక్టర్ రిన్ పటేల్ క్రిప్టోకరెన్సీ కోసం వాదిస్తున్నట్లు ప్రస్తావించారు. అయితే ఈ పేరు కల్పితమైందని  మేం గుర్తించాం.
  • ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరును ప్రస్తావించారు. వాస్తవానికి ఆయన అలాంటి ప్రకటనేదీ చేయలేదు.
  • మేం ఈ వైరల్ క్లిప్పింగ్‌లపై వివిధ అనుబంధ కీవర్డ్‌లతో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాం. దీంతో జనవరి 24న కేరళ సబ్ రెడ్డిట్‌లో ‘‘మాతృభూమి’’ పోస్ట్ చేసిన మొదటి పేజీని మేం గుర్తించాం.    మార్స్‌పై ఇంటర్‌ప్లానెటరీ ఫుట్‌బాల్ మ్యాచ్ గురించి ఆ పత్రికలో ఊహాత్మక వార్త ఒకటి ఉంది.  కేరళ యొక్క రోబోట్ మంత్రి యొక్క మొదటి వార్షికోత్సవం గురించి అందులో ఉంది. భారతదేశం పేపర్ నోట్లను క్రిప్టోకరెన్సీతో భర్తీ చేస్తోందనే మరో వార్తను కూడా దానిలో ప్రచురించారు. ఒక వినియోగదారుడు ఆ పోస్ట్‌పై స్పందిస్తూ.. ‘‘ఇది ఊహాత్మకమైన మొదటి పేజీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ పేజీ చివర్లో ఒక డిస్‌క్లెయిమర్ కూడా ఉందని గుర్తించాం.
  • ఈ క్లూని ఉపయోగించి మేం జనవరి 24న ప్రచురించిన మాతృభూమి మొదటి పేజీ PDF కాపీని సేకరించాం. Google Lensని ఉపయోగించి దాన్ని అనువదించాం. అందులోని కథనాలన్నీ ‘మార్కెటింగ్ ఫీచర్లు’ అని పేర్కొంటూ ఎగువ కుడి మూలలో ఒక గమనిక ఉండటాన్ని గుర్తించాం. ఈ పేజీలో ఒక డిస్‌క్లెయిమర్ ఉంది. “గమనిక: ఈ వార్తాపత్రికలో అందించిన మొదటి పేజీ వార్తలు కల్పితం కొచ్చిలోని జైన్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ హోస్ట్ చేసిన ‘ది సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ 2025’ ప్రచారంలో భాగంగా దీన్ని రూపొందించాం’’ అని అందులో స్పష్టంగా రాశారు.  “ఇది 2050లో వార్తాపత్రికల మొదటి పేజీ ఎలా ఉంటుందో దాని ఊహాత్మక చిత్రణ. వాస్తవ సంఘటనలు లేదా నివేదికలతో దీనిలోని సమాచారానికి ఏదైనా సారూప్యత ఉంటే అది యాదృచ్ఛికం. ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు జైన్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ లేదా దాని అనుబంధ సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించవు’’ అని డిస్‌క్లెయిమర్‌లో వివరించారు.
  • 2050లో వార్తాపత్రికల మొదటి పేజీ ఎలా ఉంటుందో ఊహాత్మకంగా వివరించే నిరాకరణలతో.. మేం 7 ఇతర కేరళ వార్తాపత్రికల మొదటి పేజీలను గుర్తించాం. మేం సేకరించిన  వార్తాపత్రికల జాబితాలోలో.. మలయాళ మనోరమ, జన్మభూమి, కేరళ కౌముది, వీక్షణం, మాధ్యమం, జనయుగం, మంగళం ఉన్నాయి.
  • పేపర్ కరెన్సీని నిలిపివేయడంపై వచ్చిన నివేదిక వార్త కాదని, అది ప్రకటన అని స్పష్టం చేస్తూ జనవరి 24న ఏషియానెట్ న్యూస్ విడుదల చేసిన వీడియో నివేదికను కూడా మేం గుర్తించాం. .
  • తమ యాడ్ వైరల్‌గా మారిన విషయం తెలియగానే జైన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ టామ్ ఎమ్ జోసెఫ్ క్షమాపణలు చెప్పారు. తమ ప్రకటన వల్ల ఏవైనా అపార్థాలు లేదా ఆందోళనలు కలిగి ఉంటే క్షమించాలని కోరారు . ఆ యాడ్‌లో తాము డిస్‌క్లెయిమర్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.

అందువల్ల, కేరళ వార్తాపత్రికలలో ప్రచురించిన ఒక ప్రకటనను నిజమైన వార్తగా ప్రచారం చేశారు. అందువల్ల దాన్ని అందరూ వార్తే అని భావించారు.  ఆ ప్రకటనలోని ఊహాజనిత అంశాలను వాస్తవాలని చాలామంది భావించారు. అందులో ఉన్నవేవీ వాస్తవాలు కావు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘న్యూస్ మీటర్’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • digital currency
  • Digital Money
  • Fact Check
  • Indian Govt
  • kerala
  • Kerala Dailies
  • Paper Currency Ban
  • Shakti Collective

Related News

Onam Celebrations Sad

Shocking Video : ఓనం వేడుకలో డ్యాన్స్ కుప్పకూలి ఉద్యోగి మృతి

Shocking Video : కేరళలోని రాష్ట్ర విధానసభలో ఓనం పండుగ వేడుకలు ఉత్సాహంగా జరుగుతుండగా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగులందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్న ఈ సమయంలో, డ్యాన్స్ చేస్తున్న జూనేష్ అబ్దుల్లా (45) అనే ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd