Zodiac Signs: కర్ణుడి లక్షణాలు ఎక్కువగా ఈ రాశులవారిలోనే ఉంటాయట!
వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు (కుజుడు) అయినప్పటికీ ఇది జల తత్వ రాశి కావడం వలన వీరు అధిక భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధైర్యం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వీరు చాలా సాహసోపేతంగా ఉంటారు.
- Author : Gopichand
Date : 08-11-2025 - 9:54 IST
Published By : Hashtagu Telugu Desk
Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొంతమంది తమ ప్రతి పనికి ఫలితం ఆశిస్తారు. మరికొంతమంది ఆశించరు. ఈ దానగుణం కలిగిన వ్యక్తులు తమకు తెలిసిన వారికి, తెలియని వారికి కూడా సహాయం చేయడానికి ముందు ఉంటారు. మహాభారతంలో కర్ణుడి వలె వీరు అడిగిన ప్రతి ఒక్కరికీ దానం చేయడంలో అగ్రగామిగా ఉంటారు. అలాంటి లక్షణాలు ఏ రాశి వారికి (Zodiac Signs) ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఇతరులకు సహాయం చేయడంలో (దానగుణం) ఎప్పుడూ ముందుంటారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు తమ ప్రియజనుల పట్ల ఉదారంగా ఉంటారు. తమ సొంత ప్రయోజనాల కంటే కూడా తమ ప్రియమైన వారి అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా తమకు తెలియని వ్యక్తులకు కూడా సహాయం చేస్తారు.
సింహ రాశి
సింహ రాశిని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశి వారు కూడా ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తారు. ఇతరుల క్షేమం కోసం వీరు ముందుకొస్తారు. వీరు పేదలకు, అవసరంలో ఉన్నవారికి తమ శక్తి మేరకు సహాయం చేస్తారు. దేవాలయాలు, అనాథాశ్రమాలకు కూడా విరాళాలు అందిస్తారు. పేదల సంతోషంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ రాశి వారు స్వతహాగానే చాలా ఉదారంగా ఉంటారు. దానం చేయడం వలన తమకు మానసిక శాంతి లభిస్తుందని వీరు నమ్ముతారు.
Also Read: Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 1 నుంచి హీట్ పెంచబోతున్నాయా?
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు (కుజుడు) అయినప్పటికీ ఇది జల తత్వ రాశి కావడం వలన వీరు అధిక భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధైర్యం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వీరు చాలా సాహసోపేతంగా ఉంటారు. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. అందరూ సంతోషంగా ఉండాలని వీరు కోరుకుంటారు. దానధర్మాలు చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. తమ స్థోమతకు మించి ఇతరులకు సహాయం చేయడానికి నిలబడతారు. ఎవరైనా తమ బాధను వీరి ముందు చెప్పుకుంటే అది తమ బాధగా భావించి, దాన్ని దూరం చేయడానికి తనువు, మనసు, ధనం అన్నింటితో సహాయం చేస్తారు.