HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >When Is The Month Of Magha Coming What Is Its Significance

మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి

  • Author : Vamsi Chowdary Korata Date : 17-01-2026 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Magha Masam
Magha Masam

Magha Masam మాఘమాసం ప్రతియేటా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య వస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం 11వ నెల. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. ఈ మాఘమాసాన్ని ఎంతో విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాఘమాసం 2026 ప్రారంభతేదీ, ముగింపు తేదీ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం.

చంద్రుడు మఘ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి వచ్చే మాసం మాఘమాసం (Magha Masam 2026). ఇక్కడ మఘం అంటే యజ్ఞం అని అర్థం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. ఇక మాఘం అంటే పాపాలను నశింపజేసేది. దక్షిణాయణంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో.. ఉత్తరాయణంలో మాఘమాసానికి అంతే విశిష్టత ఉంది. ఈ మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో (Sun Transit in Capricorn 2026) సంచరిస్తాడు. ఈ మాసంలో ప్రప్రథమం చేయాల్సింది నదీ స్నానం. ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్తి.

అలాగే పురాణ పఠనం, జపం, తర్పణం, దానధర్మాలు, హోమం వంటివి చేయడం పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది. చలికాలం ముగిసిపోయి.. వసంతం ప్రారంభానికి ముందు వచ్చే ఈ మాఘమాసం శరీరానికి, మనసుకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మాఘమాసంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది.

మాఘమాసం 2026 ప్రారంభం, ముగింపు తేదీలు

ఈ ఏడాది మాఘమాసం 2026 జనవరి 19వ తేదీన ప్రారంభమవుతుంది. అంటే జనవరి 19వ తేదీ సోమవారం మాఘ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది. అలాగే 2026 ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం మాఘ బహుళ అమావాస్య తిథితో ఈ మాఘమాసం పూర్తవుతుంది. ఇక ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసంలో వసంత పంచమి 2026, రథ సప్తమి 2026 పండుగతో పాటు.. మహాశివరాత్రి 2026 వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, సూర్య భగవానుడితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడంటంతో శివుడికి కూడా ఈ మాసం అత్యంత కీలకం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు (Sundays) చాలా విశిష్టమైనవి. ఈరోజున మహిళలు తరిగిన కూరలు తినరు. అలాగే ఈ నెలలో మాఘ గౌరి నోము, మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • Magha Masam
  • Magha Masam Significance
  • Telugu Calendar 2026

Related News

Mauni Amavasya

మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే.. హర్ష యోగం ప్రాప్తిస్తుంది

Mauni Amavasya  మనం మాట్లాడే మాటల కంటే మౌనం అత్యంత శక్తివంతమైనదని, విశిష్టమైనదని నిరూపించే రోజే పవిత్రమైన రోజే ఈ మౌని అమావాస్య. పవిత్ర నదీ సంగమంలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ విశిష్టమైన రోజుకు పితృ దేవతల ఆశీస్సులు పొందే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం అంతర్గతంగా మనిషిని అత్యంత శక్తివంతుడిని చేస్తుందని పండితులు చెబుతారు.

    Latest News

    • మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి

    • ముంబై ఫలితాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి – లోకేశ్ కీలక ప్రకటన

    • మ‌హిళ‌లు అతిగా జిమ్ చేస్తే వచ్చే స‌మ‌స్య ఏంటో తెలుసా?

    • సంక్రాంతి బరిలో దిల్ రాజు కు కాసుల వర్షం కురిపిస్తున్న మూడు సినిమాలు

    Trending News

      • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

      • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

      • ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

      • బంగారం కొనాల‌నుకునేవారికి బిగ్ అల‌ర్ట్‌.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd