Sahasra Chandra Darshan : సహస్ర చంద్ర దర్శనం.. లైఫ్ లో వెయ్యి పౌర్ణముల విశిష్టత
Sahasra Chandra Darshan : సహస్ర చంద్ర దర్శనం అంటే వెయ్యి సార్లు చంద్రుడిని వీక్షించడం. సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వ్యక్తిని భారతీయ సంప్రదాయంలో ఎంతో గౌరవిస్తారు.వెయ్యి సార్లు చంద్రుడిని వీక్షించడానికి 29,530 రోజులు లేదంటే 80 ఏళ్ల 8 నెలల టైం పడుతుంది.
- Author : Pasha
Date : 24-06-2023 - 3:14 IST
Published By : Hashtagu Telugu Desk
Sahasra Chandra Darshan : సహస్ర చంద్ర దర్శనం అంటే వెయ్యి సార్లు చంద్రుడిని వీక్షించడం.
సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వ్యక్తిని భారతీయ సంప్రదాయంలో ఎంతో గౌరవిస్తారు.
వెయ్యి సార్లు చంద్రుడిని వీక్షించడానికి 29,530 రోజులు లేదంటే 80 ఏళ్ల 8 నెలల టైం పడుతుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం.. ఒక వ్యక్తికి 80 ఏళ్ళ ఏజ్ వస్తే, అతను తన జీవితంలో వేయి పున్నములను చూశాడని అర్థం. దీన్నే సహస్త్ర చంద్ర దర్శనం(Sahasra Chandra Darshan) అని పిలుస్తుంటాం. షష్ఠిపూర్తి అనేది 60 ఏళ్లకు చేస్తారు.. సహస్ర చంద్ర దర్శనం అనే దశ మనిషి జీవితంలో 80 ఏళ్ల టైంలో వస్తుంది. అప్పుడు సహస్ర చంద్ర దర్శనం వేడుకను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులు, బంధువులు, స్నేహితులు మొదలైన వారిని పిలిచి హోమం మొదలైన కర్మలు చేస్తారు. ఈ రోజున వెయ్యి చంద్రులను చూసిన వ్యక్తిని కూడా పూజిస్తారు. సహస్ర చంద్ర దర్శనం ఛాన్స్ పొందిన వ్యక్తి వచ్చే జన్మలో కూడా బలమైన వ్యక్తిగా పుడతాడని నమ్ముతారు.
1000 పున్నముల లెక్క
ప్రతి సంవత్సరం 12 పున్నములు ఉంటాయి. కాబట్టి 80 సంవత్సరాలలో 960 పున్నములు వస్తాయి. కానీ ప్రతి 5 సంవత్సరాలకు 2 అదనపు పున్నములు ఉంటాయి. వీటిని బ్లూ మూన్స్ అని పిలుస్తారు. ఈ విధంగా 80 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి మొత్తం 992 పున్నములను చూస్తాడు. 8 నెలల్లో 8 పౌర్ణములను చూస్తే.. 80 సంవత్సరాల 8 నెలల్లో 1000 పౌర్ణమిలను చూడగలరు.
Also read : 2 Year Boy-Gun Shoot : రెండేళ్ల బాలుడి గన్ ఫైర్.. ప్రెగ్నెంట్ గా ఉన్న తల్లి మృతి
ప్రతి ఐదేళ్లకు ఏదో ఒక హోమం
హిందూ సంప్రదాయం ప్రకారం.. 77 ఏళ్ల 7 నెలల 7 రోజుల వయసులో అడుగుపెట్టిన వారికి భీమ్ రథారోహణ్ నిర్వహిస్తారు. 88 ఏళ్ల 8 నెలల 8 రోజుల వయసులో అడుగుపెట్టిన వారికి దేవ రథారోహణ్ నిర్వహిస్తారు. 99 ఏళ్ల 9 నెలల 9 రోజుల వయసు వారికి దివ్య రథారోహణ్ నిర్వహిస్తారు. సహస్ర చంద్ర దర్శన్‌ను ఉత్తర భారతం, నేపాల్, కర్ణాటక, ఏపీల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. వాస్తవానికి 50 ఏళ్లు నిండినప్పటి నుంచీ ప్రతి ఐదేళ్లకు ఏదో ఒక హోమం, శాంతి జరిపించాలని పండితులు అంటారు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.