Srisailam: శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు
- By Balu J Published Date - 07:37 PM, Mon - 1 April 24

Srisailam: శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా తరలివస్తుంటాయి. శివయ్య దర్శనం కోసం బారులు తీరుతుంటారు. ఉగాది పండుగ రోజు శుభ సందర్భంగా కర్నూలు జిల్లా కూ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీశైల పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రి మల్లికార్జున స్వామి శ్రీ భ్రమరాంబిక దేవి, అమ్మ వార్లను దర్శించుకొనుటకు మహారాష్ట్ర కర్ణాటక, బాగల్ కోట, మీరాజ్, బెల్గం, సిందునుర్ , సిరుగుప్ప, మన్వి, నుంచి కన్నడ గ్రామ వాస్తవ్యులు భక్తిశ్రద్ధలతో శ్రీశైలం కు కలినడక న సాగిపోయారు. పాదయాత్రలోనామస్మరణం చేసుకుంటూ పల్లకిని మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.
శ్రీ మల్లికార్జున స్వామి , శ్రీ భ్రమరాంబిక దేవి అమ్మ వార్లను దర్శించుటకు భారీగా తరలి వెళ్లిన భక్తాదులు కలినడకలో కాళ్లకు కట్టెలు కట్టుకుని శ్రీశైలం కు దర్శించడానికి వారి భక్తి అమోగానికి చూసి పులకించిపోయారు. ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్నారు. భక్తుల రాకతో శివనామస్మరణ మార్మోగుతోంది.