TTD Mobile App: టీటీడీ మొబైల్ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి
బుధవారం టీటీడీ (TTD) సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.
- By Vamsi Chowdary Korata Published Date - 12:30 PM, Thu - 2 February 23

ఇటీవల ప్రారంభించిన టీటీడీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ (TTD Mobile App) గురించి ఎక్కువ మందికి భక్తులందరికీ తెలిసేలా సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల్లో ప్రదర్శించాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీ సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ (TTD Mobile App) ను ఒక్క రోజులోనే 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు.
యాప్ గురించి మరింత మంది భక్తులకు తెలియజేసి టీటీడీ సమాచారం, సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. భువనేశ్వర్ లో గతేడాది ప్రారంభించిన శ్రీవారి ఆలయంలో నూతన సేవలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ సేవలను, ఇతర సమాచారాన్ని ఆలయం వద్ద ప్రదర్శించాలని సూచించారు.
Also Read: Director Sagar: డైరెక్టర్ సాగర్ అంటే మద్రాసులో అందరికి భయం!