HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >The Specialty Of Rudram Namaka Chamakam

Rudram Namaka, Chamakam: రుద్రం నమకం, చమకం యొక్క విశిష్టత..

కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత చతుర్థకాండంలోని పంచమ, సప్తమ ప్రపాఠకాలను 'నమకం, చమకం' అంటారు. రెండూ కలిపితే రుద్రం. నమక చమకాలు స్వరబద్ధంగా

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rudram Namaka, Chamakam
Rudram Namaka, Chamakam

కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత చతుర్థకాండంలోని పంచమ, సప్తమ ప్రపాఠకాలను ‘నమకం, చమకం’ అంటారు. రెండూ కలిపితే రుద్రం (Rudram). నమక చమకాలు స్వరబద్ధంగా చదువుతూ అభిషేకం నిర్వహి స్తారు. నమకంలో విశ్వంలోని ప్రతి అణువూ రుద్రుడే (Rudram) అని భావన చేస్తూ, ఆయా రూపాల్లో వ్యక్తమయ్యే రుద్రుడికి నమస్కారం చెయ్యటం ప్రధానాంశంగా ఉంటుంది. చమకంలో ఇందుకు భిన్నంగా భక్తుడు తన కోరికల చిట్టాను భగవంతుడి ముందు సమర్పిస్తాడు. ‘శివా! వీటన్నిటినీ నాకు అనుగ్రహించవలసింది’ అని ప్రార్థిస్తాడు. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన పేర్లతో పంచముఖాలతో నాలుగు దిక్కులను, ఊర్ధ్వదిశను చూస్తూ జగత్తును రక్షిస్తున్న రుద్రుడికి, పరమాత్మకు ఆత్మార్పణం చేస్తున్నానన్న భావనతో రుద్రాధ్యాయాన్ని పారాయణం చేస్తారు.

శివారాధనలో ప్రముఖమైన రుద్రాభిషేకాన్ని వివిధ రకాలుగా ఆచరిస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం, లఘురుద్రం, శతరుద్రీయం ఇలా శక్తిసామర్థ్యాలను బట్టి భక్తులు దీనిని నిర్వహిస్తూ ఉంటారు. నమక-చమకాల సంఖ్య ఆధారంగా వీటిని వివిధ రకాల రుద్రాభిషేకాలుగా పిలు స్తారు. శ్రీకృష్ణుడు ఒక ఏడాదిపాటు పాశుపత దీక్ష చేసి, విభూదిని వంటినిండా అలుముకొని, రుద్రాధ్యాయాన్ని పారాయణ చేశాడని కూర్మ పురాణం చెబుతున్నది. జాబాల ఉపనిషత్తులో బ్రహ్మచారులు ‘కిం జప్యేన అమృతత్వమ శ్నుతే?’ (దేనిని జపించడం వల్ల అమృతత్వం కలుగు తుంది) అని ప్రశ్నిస్తారు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ‘శత రుద్రీయం’ చేయడంతో అమృతత్వం సిద్ధిస్తుందని సమాధానం చెబుతాడు. నిత్యం రుద్రాధ్యాయాన్ని జపించే వాళ్లు ముక్తిని పొందుతారని స్మృతులు చెబుతున్నాయి. ఐహిక
భోగాలు, మోక్షం, పాప ప్రాయశ్చిత్తం కోరుకునేవారికి రుద్రుడి ఆరాధనకు మించిన మార్గం లేదు.

Also Read:  Navagraha Dosha: నవగ్రహ దోషాల నివారణకు స్నానాలు!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chamakam
  • devotional
  • god
  • Lord
  • Namaka
  • Rudram
  • Speciality

Related News

Hanuman Janmotsav

హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా హనుమంతుని ఆలయానికి వెళ్లి 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. ఆ తర్వాత స్వామివారికి గులాబీ పూల మాల సమర్పించి, చామంతి నూనెతో దీపం వెలిగించండి.

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

      • ఫైనల్ మ్యాచ్ పిచ్ ఎలా ఉండబోతోంది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd