HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Ohio State House And Senate Designates October As Hindu Heritage Month

Hindu Heritage Month : ఇకపై ఒహాయోలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు

ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ వారసత్వ నెల(Hindu Heritage Month)గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఒహాయో స్టేట్‌ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

  • Author : Pasha Date : 21-12-2024 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ohio State House Ohio State Senate October Hindu Heritage Month

Hindu Heritage Month : ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాలు అక్టోబరు నెలను హిందూ వారసత్వ నెలగా ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో  ఒహాయో రాష్ట్రం కూడా చేరింది. ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ వారసత్వ నెల(Hindu Heritage Month)గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఒహాయో స్టేట్‌ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఒహాయో రాష్ట్ర చరిత్రలో సెనేటర్‌గా ఎన్నికైన తొలి హిందువు  నీరజ్ అంతానీ.  ఏటా అక్టోబరు నెలను హిందూ  వారసత్వ మాసంగా జరుపుకునే బిల్లును ఆయనే సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీనిపై సెనేట్ సభ్యులను ఒప్పించడంలో నీరజ్ సక్సెస్ అయ్యారు. దీంతో ఆ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తదుపరిగా ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.

Also Read :Car Attack : జర్మనీ క్రిస్మస్ మార్కెట్‌లో జనంపైకి కారు.. ఇద్దరి మృతి, 68 మందికి గాయాలు

సెనేట్, స్టేట్ హౌస్ ఆమోదం తర్వాత రాష్ట్ర గవర్నర్  ఆమోదం లభించడం అనేది లాంఛనమే. అంటే దాదాపుగా బిల్లుకు లైన్ క్లియర్ అయినట్టే.  ఇక నుంచి ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో ఆ రాష్ట్రంలోని హిందువులు అధికారికంగా వేడుకలు నిర్వహించుకోవచ్చు. అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. తగినన్ని సెలవులు కూడా మంజూరవుతాయి. ఈసందర్భంగా నీరజ్ మాట్లాడుతూ.. ‘‘ఒహాయో రాష్ట్రంలో హిందువులు చేసిన కృష్టి వల్లే అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా గుర్తించారు. ఈ ప్రయత్నంలో నేను కూడాభాగస్తుడిగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో నివసించే హిందువులు అందరు సాధించిన విజయం ఇది’’ అని ఆయన తెలిపారు.

Also Read :Guava In Winter: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండు రోజూ తినాల్సిందే!

ఏటా అక్టోబరు నెలలో దసరా నవరాత్రులు, కర్వాచౌత్, ధన్ తేరస్, దీపావళి లాంటి ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి. అందుకే ఆ నెల హిందువులకు చాలా ముఖ్యమైనది. వరుసగా పండుగలు ఉన్నందు వల్లే ఆ నెలను హిందూ వారసత్వ మాసంగా పరిగణిస్తున్నారు. అక్టోబరు నెలలో వచ్చే తమ పండుగలను అధికారికంగా సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో .. దాన్ని హిందూ వారసత్వ మాసంగా ప్రకటించాలని అక్కడి చట్టసభలను హిందువులు కోరుతున్నారు. హిందూ వర్గాల ఈ డిమాండ్‌ను ఇప్పటికే చాలా అమెరికా రాష్ట్రాలు ఆమోదించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Antani
  • Hindu Heritage Month
  • October
  • Ohio
  • Ohio State House
  • Ohio State Senate
  • us

Related News

New Supreme Leader Of Iran

Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్

ఇరాన్ సుప్రీం లీడర్ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం (IRGC) మరియు విదేశాంగ విధానంపై పూర్తి అధికారం ఉన్న సర్వోన్నత శక్తి. కొత్త నేత రాకతో మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుసరించే వ్యూహాలు మారవచ్చు

  • Iran Attack

    War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Iran's president apologises for air strikes on Gulf countries

    ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

Latest News

  • ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

  • విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

  • IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

  • Audi India price hike: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆడి లగ్జరీ కార్ల ధరలు

  • Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd