Lord Shiva: పంచభూతాలకి ప్రతీకగా శివుడు.. వాటి ప్రత్యేకత మీకు తెలుసా
- By Balu J Published Date - 06:19 PM, Mon - 18 March 24
![Lord Shiva: పంచభూతాలకి ప్రతీకగా శివుడు.. వాటి ప్రత్యేకత మీకు తెలుసా](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/06/Lord-Shiva.jpg)
Lord Shiva: పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
జలలింగం: ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడు లోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
అగ్ని లింగం: తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రం పై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు.
వాయులింగం: ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Dream: కలలో శివలింగం మీద శివుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/MixCollage-15-Jul-2024-05-59-PM-2829.jpg)
Dream: కలలో శివలింగం మీద శివుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో అప్పుడప్పుడు దేవుళ్లకు సంబంధించిన కలలు కూడా వస్తూ ఉంటాయి.