TTD: తిరుపతిలో త్వరలో కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- By Balu J Published Date - 10:34 PM, Wed - 21 February 24
TTD: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.
వాహనసేవల వివరాలు :
01-03-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – హంస వాహనం
02-03-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
03-03-2024
ఉదయం – భూత వాహనం
రాత్రి – సింహ వాహనం
04-03-2024
ఉదయం – మకర వాహనం
రాత్రి – శేష వాహనం
05-03-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – అధికారనంది వాహనం
06-03-2024
ఉదయం – వ్యాఘ్ర వాహనం
రాత్రి – గజ వాహనం
07-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – అశ్వ వాహనం
08-03-2024
ఉదయం – రథోత్సవం (భోగితేరు)
రాత్రి – నందివాహనం
09-03-2024
ఉదయం – పురుషామృగవాహనం
సాయంత్రం – కల్యాణోత్సవం,
రాత్రి – తిరుచ్చి ఉత్సవం
10-03-2024
ఉదయం – త్రిశూలస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం,
రాత్రి – రావణాసుర వాహనం
Tags
Related News
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్ల వివరాలు ఇదిగో
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి, శ్రీవారి సేవ కోసం ఆన్లైన్ కోటా విడుదల వివరాలను ప్రకటించింది. టిటిడి అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా భక్తులు తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం […]