ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!
- Author : Vamsi Chowdary Korata
Date : 10-01-2026 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
Zodiac Signs జ్యోతిష్యం ప్రకారం వచ్చే వారం పుష్య మాసంలో మకర సంక్రాంతి పండుగ వేళ శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభం, సింహం కొన్ని రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి మాసం రెండో వారంలో మకర రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మకర రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా వృషభం, సింహం సహా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభం కలగనుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించనుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా అద్భుత ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు ఊహించని విధంగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ సందర్భంగా జనవరి రెండో వారంలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసిరానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి(Taurus)..
వృషభ రాశి వారికి వచ్చే వారం కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి మీరు కొత్త అవకాశాలు పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ మనసులో ప్రశాంతంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలన్నీ తొలగిపోతాయి.
మిథున రాశి(Gemini)..
మిథున రాశి వారికి వచ్చే వారం మకర సంక్రాంతి, శుక్రాదిత్య యోగం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. వారం చివర్లో మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి.
కర్కాటక రాశి(Cancer)..
కర్కాటక రాశి వారికి వచ్చే వారంలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఈ కాలంలో ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వారం చివర్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
సింహ రాశి(Leo)..
సింహ రాశి వారికి ఈ వారం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వారం మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తి, సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ భాగస్వామి నుంచి మంచి బహుమతి పొందుతారు. ఈ వారం మీరు చేపట్టే ప్రయాణాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
వృశ్చిక రాశి(Scorpio)..
వృశ్చిక రాశి వారిలో ఉద్యోగులు వచ్చే వారం కార్యాలయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ మనసులో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.