Ugadi 2023: ఉగాది వేళ ఇంటికి ఈ వస్తువులు తెస్తే.. ఇక శుభాల క్యూ
హిందూ నూతన సంవత్సరం 'విక్రమ సంవత్ 2080' మార్చి 22 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. చైత్ర మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి నాడు బ్రహ్మ దేవుడు విశ్వాన్ని..
- By Vamsi Korata Published Date - 06:00 AM, Sat - 18 March 23

హిందూ నూతన సంవత్సరం ‘విక్రమ సంవత్ 2080’ మార్చి 22 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. చైత్ర మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి నాడు బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు. కొత్త సంవత్సరం (Ugadi) ప్రారంభానికి ముందు హిందువులు ఇంటికి కొన్ని శుభ వస్తువులు తీసుకువస్తే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అవి ఎన్నో శుభాలను అందిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ శుభ వస్తువులు ఏమిటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న కొబ్బరి:
మీరు ఉగాదికి (Ugadi) ముందు ఒక చిన్న కొబ్బరికాయను ఇంటికి తీసుకురండి. ఈ కొబ్బరికాయను డబ్బులు ఉంచే బీరువాలో పెట్టండి. ఫలితంగా మీ ఇంట్లోని సంపద, ఐశ్వర్యం చెక్కుచెదరవు.
తులసి మొక్క:
మీరు ఉగాది (Ugadi) సందర్భంగా తులసి మొక్కను ఇంటికి తీసుకు రావచ్చు. ఇంట్లో ఏదైనా ఇండోర్ ప్లాంట్‌ను నాటడం శుభ పరిణామంగా పరిగణించ బడుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు.
మెటల్ తాబేలు:
విక్రమ్ సంవత్ 2080కి ముందు లోహపు తాబేలును కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రంలో.. తాబేలును ఆనందం , శ్రేయస్సుల చిహ్నంగా పరిగణిస్తారు. ఇత్తడి, కాంస్యం లేదా వెండితో చేసిన తాబేలును హిందూ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ముందు కొనొచ్చు.
మెటల్ ఏనుగు:
హిందూ నూతన సంవత్సరానికి ముందు మీరు లోహంతో చేసిన ఏనుగు బొమ్మను కొని ఇంటికి తీసుకురావచ్చు. ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈసారి కొత్త సంవత్సరానికి ఘనమైన వెండి లోహంతో చేసిన ఏనుగు విగ్రహాన్ని కొనుగోలు చేయండి. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల శాంతి, ఆనందం, శ్రేయస్సు చేకూరుతాయి.
ముత్యాల శంఖం:
ఉగాది (Ugadi) వేళ ముత్యపు శంఖాన్ని ఇంట్లో ఉంచడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి. ధనానికి లోటు ఉండదు. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరానికి ముత్యాల శంఖాన్ని కొని ఇంటికి తీసుకొని రండి. దానిని పూజించిన తరువాత.. డబ్బులు ఉంచే బీరువాలో దాన్ని పెట్టండి. ఇది మీ పురోగతికి కొత్త తలుపులు తెరుస్తుంది. డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా చేస్తుంది.
నెమలి ఈక:
శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెమలి ఈకను ఏ ఇంట్లో ఉంచితే అక్కడ లక్ష్మి మాత నివసిస్తుంది. మీరు మీ ఇంటిని ఆనందంతో నింపాలనుకుంటే, హిందూ నూతన సంవత్సరానికి ముందు ఇంట్లో నెమలి ఈకలను ఉంచండి. అయితే 1 నుంచి 3 నెమలి ఈకలు మాత్రమే ఇంట్లో ఉంచాలని గుర్తుంచుకోండి.
లాఫింగ్ బుద్ధ:
మీరు హిందూ నూతన సంవత్సరం తొలిరోజున ఇంటికీ లాఫింగ్ బుద్ధను కూడా తీసుకురావచ్చు. దీన్ని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు.
Also Read: Profit in Business: మీ వ్యాపారం లేదా సంస్థలో లాభాలను పొందడానికి మీ పని ప్రదేశంలో ఈ దిశలో కూర్చోండి

Related News

Shani: శని దేవుడిని శనివారం ప్రసన్నం చేసుకునే ఉపాయాలివీ..
మీరు శని యొక్క అశుభ ప్రభావాల నుంచి విముక్తి పొందాలని భావిస్తున్నారా? శనిదేవుని అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారా? అయితే శనివారం నాడు ఈ ప్రభావవంతమైన..