HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Do You Know The Reason Why Ayyappa Appears In Yogasanam

Yogasanam: యోగాసనంలో అయ్యప్ప దర్శనమివ్వడానికి కారణం తెలుసా?

హరిహరాదుల అంశతో జన్మించిన శబరిమల అయ్యప్పస్వామి చిన్ముద్రిధారియై భక్తులకు దర్శనమిస్తారు. మిగతా దేవతలతో పోలిస్తే స్వామివారు యోగాసనంలో కూర్చుంటారు.

  • By Vamsi Korata Published Date - 06:30 AM, Wed - 8 March 23
Yogasanam: యోగాసనంలో అయ్యప్ప దర్శనమివ్వడానికి కారణం తెలుసా?

హరిహరాదుల అంశతో జన్మించిన శబరిమల అయ్యప్పస్వామి చిన్ముద్రిధారియై భక్తులకు దర్శనమిస్తారు. మిగతా దేవతలతో పోలిస్తే స్వామివారు యోగాసనంలో (Yogasanam) కూర్చుంటారు. స్వామి మోకాళ్ల చుట్టూ బంధనం ఉంటుంది. దీన్ని పట్టబంధనం అంటారు. మహిషి సంహారం కోసం మానవ రూపంలో అవతరించిన హరిహరసుతుడు పందళరాజు వద్ద పెరిగాడు. సంతానం లేక బాధపడుతోన్న పందళరాజు అడవిలో దొరికిన బాలుడిని మణికంఠుడిగా పెంచి పెద్ద చేశాడు.

ఆయనకు విద్యాబుద్దులు చెప్పించి, రాజుగా పట్టాభిషేకం చేయాలని భావించాడు. అయితే తాను హరిహరసుతుడనని, ధర్మసంస్థాపన కోసం మానవ రూపంలో మహిషి సంహారం కోసం అవతరించాననే సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్నారు. మహిషిని వధించిన అయ్యప్పస్వామి తన అవతారం పూర్తయిందని పందళరాజుకు చెప్పి, తన కోసం ఆలయాన్ని నిర్మించమన్నారు. స్వామి కోరిక మేరకు శబరిమల ఆలయంలో పందళరాజు ఆలయం నిర్మించారు. అలా చిన్ముద్ర దాల్చి యోగాసనంలో (Yogasanam) జ్ఞాన పీఠంపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటారు. శబరిగిరిపై ఆలయం నిర్మించి, స్వామికి ఆభరణాలు సమర్పించేందుకు పద్దెనిమిది మెట్లెక్కి పందళరాజు వస్తారు.

తన పెంపుడు తండ్రి పందళరాజు రాకను గుర్తించిన స్వామి యోగాసనం (Yogasanam) నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు. దీంతో పందళరాజు స్వామివారిని నిలువరించి తన భుజాన ఉన్న పట్టు వస్త్రంతో స్వామివారి మోకాళ్లకు చుట్టి బంధిస్తారు. తాను అయ్యప్పస్వామిని ఏ విధంగా చూసి తరించానో అదేవిధంగా భక్తులకు అదే రూపంలో దర్శనం ఇవ్వాలని అయ్యప్పస్వామిని అర్థించడంతో ఆయన అనుగ్రహించారు. అలా కట్టి ఉన్నదానిని పట్ట బంధం అంటారు. ఇది శివకేశవులను ఐక్య పరిచే బంధమని కూడా అంటారు. తనకు ఎలాంటి భవబంధాలు లేవని చెప్పడానికి స్వామి ఈ ఆసనంలో కూర్చుంటారని అంటారు.

Also Read:  Stotras: గ్రహ దోషాల నుండి విముక్తి కలగాలంటే ఈ స్తోత్రం పఠించండి..

Telegram Channel

Tags  

  • ayyappa
  • devotional
  • god
  • Lord
  • reason
  • Yogasanam
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!

TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గొప్ప శుభవార్త చెప్పింది. నడక దారిలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తునట్లు తెలిపింది.

  • Ramayanam: రామాయణ అద్భుత ఘట్టం.. నేను లేకపోతే? ఏమయ్యేదొ అనుకోవద్దు..

    Ramayanam: రామాయణ అద్భుత ఘట్టం.. నేను లేకపోతే? ఏమయ్యేదొ అనుకోవద్దు..

  • Horoscope 2023: బృహస్పతి అస్తమిస్తే.. ఈ 4 రాశుల వారి ఎదుట సమస్యల క్యూ

    Horoscope 2023: బృహస్పతి అస్తమిస్తే.. ఈ 4 రాశుల వారి ఎదుట సమస్యల క్యూ

  • Glory of Sri Rama: శ్రీరామ నామ మహిమ

    Glory of Sri Rama: శ్రీరామ నామ మహిమ

  • Ramayanam: రామాయణం విశేషాలు

    Ramayanam: రామాయణం విశేషాలు

Latest News

  • Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్

  • Samantha: మహిళలకు సమాన పారితోషికంపై సమంత స్పందన ఇదే.. ఇచ్చింది తీసుకోవడమే..!

  • Dharmapuri Srinivas: ధర్మపురి సోదరుల మధ్య రచ్చకెక్కిన విభేదాలు

  • TDP- CBN :ఎన్నిక‌ల‌ రోడ్ మ్యాప్,ఎన్టీఆర్ ట్ర‌స్ట్ లో సంద‌డి

  • Mahila Samman Saving Certificate Scheme: మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ స్కీం

Trending

    • Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

    • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

    • PGCIL Recruitment : బీటెక్ చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారేంటీ…ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు

    • World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: