Astro Tips: మీ ఇంట్లో గంగాజలం ఉందా..? అయితే మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!!
సనాతన ధర్మంలో, గంగా నదిని స్వరూప దేవతగా కొలుస్తుంటారు. కలియుగంలో గంగను పాప తారిణి అని కూడా అంటారు.
- By hashtagu Published Date - 07:00 AM, Fri - 30 September 22
సనాతన ధర్మంలో, గంగా నదిని స్వరూప దేవతగా కొలుస్తుంటారు. కలియుగంలో గంగను పాప తారిణి అని కూడా అంటారు. ఏదైనా శుభ కార్యంలో గంగాజలం తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గంగాజలం ఇంటి స్వచ్ఛతను కాపాడుతుందని నమ్ముతుంటారు. మత విశ్వాసాల ప్రకారం, గంగాదేవి మోక్షానికి దేవత. ఏ ప్రత్యేక సందర్భంలో ఎంతమంది ఈ నదిలో స్నానం చేసి మోక్షం కోసం ప్రార్థిస్తారో లెక్కుండదు. అంతే కాదు, గంగాజలాన్ని ఇంట్లో ఉంచడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఆ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం ఉంటుంది.
మీరు కూడా ఈ పవిత్ర జలాన్ని మీ ఇంట్లో ఉంచినట్లయితే.. దాని స్వచ్ఛతను కాపాడుకోవడానికి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం ఈ తప్పులను అస్సలు చేయకండి. గంగాజలాన్ని ఇంట్లో ఉంచేటప్పుడు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.
ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి:
గంగాజలాన్ని ఉంచే ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పూజాగదిలో తప్పా ఇతర ప్రదేశాల్లో ఉంచకూడదు. అలా చేసినట్లయితే గంగాజలం స్వచ్చతను అవమానించినట్లవుతుంది. గంగాజలం ఉన్న ఇంట్లో మాంసాహారం, మద్యం సేవించకూడదు.
మురికి చేతులతో గంగాజలాన్ని తాకకూడదు:
గంగాజలాన్ని తాకే ముందు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గంగాజలాన్ని మురికి చేతులతో తాకకూడదు. మురికి చేతులతో లేదా అపరిశుభ్రమైన స్థితిలో మీరు దానిని తాకినట్లయితే…దాని పవిత్రతను కోల్పోతోంది. మీరు గంగాజలాన్ని తాకాలనుకుంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకండి. అపరిశుభ్రమైన శరీరంతో గంగాజలాన్ని తాకినట్లయితే ఇంట్లో అరిష్టానికి దారి తీస్తుంది.
గంగాజలాన్ని ఈ ప్రదేశాలలో ఉంచకూడదు:
ఇంట్లోని పవిత్ర స్థలాల్లో మాత్రమే గంగాజలాన్ని ఉంచాలి. చీకటి ప్రదేశంలో ఉంచకూడదు. ప్లాస్టిక్ బాటిల్లో లేదా ఇంట్లో పెట్టెలో భద్రపరుస్తారు. అయితే గంగాజలాన్ని పొరపాటున కూడా ప్లాస్టిక్ బాటిల్లో ఉంచకూడదు. వాస్తవానికి ప్లాస్టిక్‌ను స్వచ్ఛంగా పరిగణించరు. దీని కారణంగా ఈ పవిత్ర జలం కూడా అపరిశుభ్రంగా మారుతుంది. మీ ఇంట్లో గంగాజలం ఉంచితే, వీలైనంత వరకు రాగి, ఇత్తడి, మట్టి లేదా వెండి పాత్రలలో ఉంచండి. మీరు ఈ నీటిని గాజు సీసాలో కూడా ఉంచవచ్చు.
ఈ సమయంలో గంగాజలాన్ని తాకవద్దు:
సూర్య, చంద్రగ్రహణం ఉన్నప్పుడల్లా గంగాజలాన్ని తాకవద్దు. సంతానం కలిగిన స్త్రీ 40 రోజుల పాటు గంగాజలాన్ని ముట్టకూడదు. నిజానికి ఈ సమయంలో గంగాజల స్పర్శ దానిని కలుషితం చేస్తుంది.
Tags
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.