Srisailam: శ్రీశైలం ఆలయ హుండీల లెక్కింపు, ఎంత నగదు వచ్చిందంటే
- By Balu J Published Date - 11:36 PM, Thu - 28 March 24
Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 18 రోజులలో (12.03.2024 నుండి 27.03.2024 వరకు) సమర్పించడం జరిగింది.
అదేవిధంగా 178 – యుఎస్ డాలర్లు, 20 సాదిఆరేబియా రియాల్స్ 20 – యు.కె. ఫౌండ్సు 5 – ఆస్ట్రేలియా డాలర్లు, 100- స్వీడన్ జోనర్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
Related News
AP News: విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల అధికారులు, ప్రత్యేక పోలీసుల బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులకు డబ్బుతో పాటు బంగారు నగదు పట్టుబడుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా బంగారం దొరికింది. విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహించారు. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ భారీ మొత్తంలో బ�