HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Char Dham Yatra Suspended For 24 Hours Amid Heavy Rain Alert In Uttarakhand

Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రకు బ్రేక్‌.. కార‌ణ‌మిదే?

చార్‌ధామ్ యాత్రా మార్గంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడే ఘటనలు పెరిగాయని తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో కొండచరియల గురించిన వార్తలు వస్తున్నాయి.

  • Author : Gopi Date : 29-06-2025 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Char Dham Yatra
Char Dham Yatra

Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రను (Char Dham Yatra) తదుపరి 24 గంటల పాటు నిలిపివేశారు. దీనికి కారణం పర్వత ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించ‌క‌పోవ‌టం అని అధికారులు చెబుతున్నారు. చార్‌ధామ్ యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడే ఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాగే, తదుపరి 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జరగకుండా ఉండేందుకు పరిపాలన అప్రమత్తంగా ఉంటూ యాత్రను 24 గంటల పాటు నిలిపివేయాలని నిర్ణయించింది.

చార్‌ధామ్ యాత్రా మార్గంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడే ఘటనలు పెరిగాయని తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో కొండచరియల గురించిన వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా యాత్ర చేయాలని అధికారులు కోరడం జరిగింది. డెహ్రాడూన్ వాతావరణ శాఖ ప్రకారం.. రాష్ట్రంలోని డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, హరిద్వార్, చంపావత్, నైనీతాల్, ఉధమ్ సింగ్ నగర్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేయబడింది.

Also Read: Stampede: మ‌రో తొక్కిస‌లాట‌.. ముగ్గురు భ‌క్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!

యాత్రికులకు తగిన ఏర్పాట్లు

చార్‌ధామ్ యాత్ర నిలిపివేతకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ డీఎం ప్రశాంత్ కుమార్ ఆర్య మాట్లాడుతూ.. డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం భారీ వర్ష హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని గఢ్‌వాల్ కమిషనర్ ఆదేశాల మేరకు చార్‌ధామ్ యాత్రను తదుపరి 24 గంటల పాటు నిలిపివేశామని తెలిపారు. జిల్లాలో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో ఆపివేయాలని పోలీసులకు, సంబంధిత ఎస్‌డీఎంలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు యాత్ర బంద్‌

వినయ్ శంకర్ పాండే న్యూస్ ఏజెన్సీ ANIతో యాత్ర గురించి మాట్లాడారు. తదుపరి 24 గంటల పాటు యాత్రపై నిషేధంతో పాటు పోలీసు, పరిపాలన అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో హరిద్వార్, రిషికేష్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్‌లలో యాత్రికులను ఆపివేయడం జరుగుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యాత్ర నిలిపివేయబడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Char Dham Yatra
  • Heavy Rain Alert
  • IMD Rain Alert
  • uttarakhand
  • Weather Update

Related News

Telangana Rain Alert, telangana heavy rain alert, Rain Alert Today, Rain Alert Telangana, rain alert, IMD Rain Alert, Hyderabad Rain Alert, Heavy Rain Alert, weather report, Telangana Weather Report,  IMD weather report, 

Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల

తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రానున్న రోజుల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబా

  • Heavy rains in these districts of AP

    Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు

  • Heavy rain warning for these districts in Telangana!

    Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

  • Heavy rains in these districts of AP

    Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

  • Telangana Rain Alert, telangana heavy rain alert, Rain Alert Today, Rain Alert Telangana, rain alert, IMD Rain Alert, Hyderabad Rain Alert, Heavy Rain Alert, weather report, Telangana Weather Report,  IMD weather report, 

    Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు

Latest News

  • Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • కార్మిక శాఖ పేరులో మార్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై ‘శక్తి’ శాఖగా

  • Isakapatnam: ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’

  • vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd