HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Bhag Savari Utsavam In Tirumala

Tirumala: తిరుమలలో వైభ‌వంగా భాగ్‌ సవారి ఉత్స‌వం..!

అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది సాక్షాత్తు స్వామివారేనని విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.

  • Author : Gopichand Date : 13-10-2024 - 8:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala
Tirumala

Tirumala: తిరుమల (Tirumala)లో బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఆలయం నుంచి మలయప్ప స్వామి దేవేరులతో క‌లిసి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారుతోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ ఉత్సవం ముగిసింది‌. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి దంపతులు, పేష్కార్ రామ‌కృష్ణ, పారు పత్తేదారు హిమత్ గిరి, ఇతర ఆలయ అధికారులు, శ్రీ‌వారి భక్తులు పాల్గొన్నారు.

భాగ్‌ సవారి అంటే ఏమిటి?

పురాణాల ప్రకారం స్వామి వారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి దేవేరి సమేతంగా స్వామివారు తిరుమలలోని అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో వెళతారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు.

Also Read: GN Sai Baba :’సాయిబాబా భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగిస్తాం’: కుటుంబ సభ్యులు

అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది సాక్షాత్తు స్వామివారేనని విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ బాగ్ స‌వారి ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhag Savari
  • devotional
  • devotional news
  • Divine Human Couple
  • tirumala
  • Tirumala Tirupathi Devasthanam
  • ttd

Related News

Kamada Ekadashi 2026

కామదా ఏకాదశి.. ఇలా చేస్తే కోరిక‌లు నేర‌వేర‌తాయి!

ఈసారి కామదా ఏకాదశి 28 మార్చి 2026 ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు 29 మార్చి 2026 ఉదయం 7 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని మార్చి 29న ఆచరించాలి.

    Latest News

    • Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు

    • Azharuddin: ఎల్బీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిన మంత్రి అజారుద్దీన్..

    • PSL Ball Tampering: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ ప్లేయర్లు..

    • Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.

    • Gas cylinder: గ్యాస్ సిలిండర్ తేలేదని.. ఫినాయిల్ తాగిన భార్య..

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd