Predictions 2026 లో కరోనాకు మించిన గండం..హెచ్చరించిన భవిష్యవాణి!
- Author : Vamsi Chowdary Korata
Date : 13-12-2025 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ఆగమనానికి సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. ఆయా రాశుల వాళ్లు కొత్త ఏడాదైనా అన్నీ విధాల కలిసి వస్తుందని కొంగొత్త ఆశలతో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్న భవిష్యవాణి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కొంత ఆందోళ కలిగించేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో బాబా వంగా నోస్ట్రాడమస్ , పురాతన గ్రంథం భవిష్య మాలిక అంచనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొద్ది రోజుల్లో ప్రపంచం మొత్తం నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా New Year 2026 ఎలా ఉండబోతోంది.. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో బాబా వంగా Baba Vanga, నోస్ట్రాడమస్ మరియు పురాతన గ్రంథం భవిష్య మాలిక 2026 నూతన సంవత్సరానికి సంబంధించి చెప్పిన అంచనాలు కొంత ఆందోళనలు రేకెత్తించేలా ఉన్నాయ్. నూతన సంవత్సరం 2026 ప్రపంచమంతా షాక్‌లు, ప్రకృతి వైపరీత్యాలు లేదా అనేక నాటకీయ మార్పులను తీసుకొస్తుందని చెప్పడంతో అందరిలో కొంత ఆందోళన మొదలైంది.
2026 బాబా వంగా అంచనాలు
బాబా వంగా 2026 అంచనాల ప్రకారం కృత్రిమ మేధస్సు మానవ జీవితాన్ని డామినేట్ చేస్తుందని చెబుతున్నాయి. అలాగే AI సాంకేతికతపై అధికంగా ఆధారపడటం చివరికి ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది. ఇది మానవ నియంత్రణ కోల్పోవడానికి, పెద్ద అంతరాయాలకు దారితీస్తుందని తెలియజేసింది. ఈ విషయంలో కాస్తా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే ప్రపంచంలో విపరీతమైన వాతావరణ సంఘటనలైన భూకంపాలు, వర్షాలు వరదలు, సునామీలు, తీవ్రమైన వేడి గాలులు, ఇతర విపత్తుల వంటి తీవ్రమైన వాతావరణ మార్పులు కూడా ఉంటాయని.. ఈ ప్రకృతి వైపరీత్యాలు సృష్టించే విస్తృత విధ్వంసం నుంచి తప్పించుకోవాలంటే తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే గ్రహాంతర జీవులతో ఒక ఎన్కౌంటర్‌ను మానవాళి చూడవచ్చని చెబుతుంది.
2026 భవిష్య మాలిక అంచనాలు
భవిష్య మాలిక అంచనాల ప్రకారం.. కొత్త ఏడాదిలో కరోనా కంటే ప్రమాదకరమైన నయం చేయలేని వ్యాధుల గురించి భవిష్య మాలిక హెచ్చరిస్తుంది. ఈ వ్యాధుల వ్యాప్తి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సైతం ముంచెత్తవచ్చని చెబుతోంది. సామూహిక భయాందోళనలకు గురిచేయవచ్చు, పెద్ద స్థాయిలో ప్రాణనష్టానికి దారితీయవచ్చని సైతం హెచ్చరిస్తోంది. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని.. అన్నీ రకాల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తుంది.
అలాగే వాయు, భూమి, సముద్ర ప్రయాణాలకు సంబంధించిన ప్రమాదాలు కూడా పెరుగుతాయని కూడా పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు సైతం పెరుగుతాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా భవిష్య మాలిక మూడవ ప్రపంచ యుద్ధం గురించి చెబుతోంది. ఈ అంచనా ప్రకారం చైనా, మరో పదమూడు ఇస్లామిక్ దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ సంఘర్షణ అణు ఘర్షణగా మారవచ్చని.. ఇది ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న ప్రపంచ పొత్తులు విచ్ఛిన్నం కావచ్చని.. కొత్త దేశాలు శక్తివంతమైన స్థాయికి ఎదగవచ్చని.. కృత్రిమ మేధస్సు (AI)తో సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటాయని అంచనా వేస్తోంది.
2026 నోస్ట్రాడమస్ అంచనాలు
చైనా, జపాన్ వంటి తూర్పు దేశాల్లో కృత్రిమ మేధస్సు పెరుగుదల గురించి నోస్ట్రాడమస్ సూచించాడని ఆధునిక పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఆటోమేషన్, ఆర్థిక మార్పుల కారణంగా పాశ్చాత్య శక్తి క్షీణించవచ్చని సూచించారు. అలాగే ప్రపంచ ఉద్రిక్తతలు పెరగడాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఇక ప్రపంచ సంఘర్షణలు, తీవ్రమైన వాతావరణ సంఘటనలు, వేగవంతమైన AI అభివృద్ధి, ప్రధాన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయట.