Covid : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
- Author : Prasad
Date : 20-06-2022 - 7:06 IST
Published By : Hashtagu Telugu Desk
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో జూన్ 23న జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకానందుకు అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ప్రకటన చేశారు. ” కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చినందున, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు రాజేంద్ర నగర్ ప్రజలను క్షమించాలని నేను కోరుతున్నాను” అని ఆమె హిందీ ట్వీట్ చేశారు. బిజెపి అభ్యర్థికి ఓటు వేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కోవిడ్-19 పాజిటివ్ రావడం ఇది రెండోసారి. ఆమెకు గతంలో 2020లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.