Viswak Sen : లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఏ సినిమా కోసమో తెలుసా..?
Viswak Sen యువ హీరోల్లో వరుస సినిమాలత్ దూసుకెళ్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. మార్చి 8న గామి సినిమాతో వస్తున్న విశ్వక్ సేన్ ఆ సినిమాతో పాటుగా మెకానిక్ రాకీ, కల్ట్ సినిమాలు చేస్తున్నట్టు
- Author : Ramesh
Date : 02-03-2024 - 7:42 IST
Published By : Hashtagu Telugu Desk
Viswak Sen యువ హీరోల్లో వరుస సినిమాలత్ దూసుకెళ్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. మార్చి 8న గామి సినిమాతో వస్తున్న విశ్వక్ సేన్ ఆ సినిమాతో పాటుగా మెకానిక్ రాకీ, కల్ట్ సినిమాలు చేస్తున్నట్టు చెప్పాడు. ఇక లేటెస్ట్ గా లైలా అనే లవ్ స్టోరీ కూడా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా తన ప్రొడక్షన్ లో కొత్త డైరెక్టర్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీగా రాబోతుందని అంటున్నారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అలరిస్తాడట. ఇప్పటికే మన స్టార్స్ కొంతమంది లేడీ గెటప్ లో కనిపించి అలరించారు. కమల్ హాసన్, శివ కార్తికేయన్, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్ ఇలా తెలుగు స్టార్స్ లేడీ గెటప్ లో కనిపించారు.
ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా అలాంటి పాత్రతో సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఇంతకీ లైలా కథ ఏంటి.. విశ్వక్ ఎవరి కోసం లేడీ గెటప్ వేస్తున్నాడు. ఆ సినిమా మిగతా కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా మే నెలలో సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.
Also Read : Mahesh Babu As DJ Tillu : డీజే టిల్లు హీరో మహేష్ అయితే.. వైరల్ అవుతున్న వీడియో..!