Mahesh Babu As DJ Tillu : డీజే టిల్లు హీరో మహేష్ అయితే.. వైరల్ అవుతున్న వీడియో..!
Mahesh Babu As DJ Tillu టెక్నాలజీ వచ్చాక ఎవరు ఏమనుకుంటే అది చేసేయడమే అనేలా ఉంది పరిస్థితి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఫన్నీగా అనిపించే ప్రయోగాలైతే అదే టెక్నాలజీ కొన్ని సెలబ్రిటీస్ ని ఇబ్బంది
- Author : Ramesh
Date : 02-03-2024 - 7:18 IST
Published By : Hashtagu Telugu Desk
Mahesh Babu As DJ Tillu టెక్నాలజీ వచ్చాక ఎవరు ఏమనుకుంటే అది చేసేయడమే అనేలా ఉంది పరిస్థితి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఫన్నీగా అనిపించే ప్రయోగాలైతే అదే టెక్నాలజీ కొన్ని సెలబ్రిటీస్ ని ఇబ్బంది పెట్టేలా వస్తున్నాయి. సాంకేతికతను వాడుకోవడం అనేది ఎవరికి వారు తమ లిమిట్స్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన ఏఐ వీడియోల వల్ల వస్తున్న తలనొప్పులు తెలిసిందే. ఈమధ్య స్టార్ హీరోయిన్స్ ఫేస్ మార్ఫింగ్ తో పెద్ద దుమారాన్నే లేపారు.
ఇక లేటెస్ట్ గా అలాంటి ఒక ప్రయోగమే చేశారు కొందరు. అయితే ఈసారి మహేష్ ని టార్గెట్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమాలోని అతని పాత్రను మహేష్ చేస్తే ఎలా ఉంటుందో ఏ.ఐ ద్వారా ఫేస్ మార్ఫింగ్ చేసి వీడియో సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాధిక ఇంటికి టిల్లు వచ్చే సీన్ ని ఏ.ఐ ద్వారా మార్ఫింగ్ చేసి సిద్ధు ఫేస్ ని మహేష్ ఫేస్ గా మార్చేశారు. డీజే టిల్లు గెటప్ లో మహేష్ వెరైటీగా ఉన్నాడని చెప్పొచ్చు. మరి ఈ వీడియో సరదాగా తీసిందే అయినా ఇలాంటి వీడియోల వల్ల టెక్నాలజీ తప్పుదారి పడుతుందే తప్ప ఉపయోగం ఉండదు. మరి దీనిపై మహేష్ కానీ డీజే టిల్లు టీం కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.