Chiranjeevi – Kohli : కోహ్లీకి చిరంజీవి పాటలు అంటే ఇష్టం.. క్రికెటర్ రవితేజ కామెంట్స్..
కింగ్ కోహ్లీకి కూడా చిరంజీవి పాటలు అంటే ఇష్టం అంట. ఈ విషయాన్ని అతని స్నేహితుడు క్రికెటర్ రవితేజ..
- By News Desk Published Date - 10:55 AM, Wed - 17 July 24

Chiranjeevi – Kohli : మెగాస్టార్ చిరంజీవి పాటలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. చిరు వేసే డాన్సులు కోసం మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా శ్రద్ధ తీసుకోని అదిరిపోయే ట్యూన్స్ ని కంపోజ్ చేసేవారు. ఇక ఆ ట్యూన్స్ కి చిరు వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే.. డాన్స్ రాని వారు కూడా చిందులు వేస్తారు. అలంటి చిరంజీవి స్టెప్పులకు, పాటలకు సెలబ్రిటీస్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఆ అభిమానులు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెటర్ రవితేజ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ద్వారక రవితేజ తెలంగాణకు చెందిన క్రికెటర్. గతంలో అండర్15 ఆడే సమయంలో రవితేజ, కోహ్లీతో కలిసి ఆడారు. ఆ సమయంలో రవితేజ, కోహ్లీతో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారట. ఇక చిరంజీవి అభిమాని అయిన రవితేజ ప్రతిరోజు చిరంజీవి పాటలు వినేవారట. ఆ సమయంలోనే కోహ్లీకి చిరంజీవి పాటలు పై ఇష్టం ఏర్పడిందట. దీంతో ప్రతిరోజు చిరంజీవి పాటలు పెట్టుకొని డాన్సులు వేసేవారట. అంతేకాదు, రవితేజ మరియు కోహ్లీ ఒకరిని ఒకరు చిరు అని సరదాగా పిలుచుకుంటారట.
అండర్15 తరువాత రవితేజ, కోహ్లీ మళ్ళీ ఆరేళ్ళ తరువాత కలుసుకున్నారట. ఇక ఆ సమయంలో కూడా కోహ్లీ, రవితేజని.. చిరంజీవి ఎలా ఉన్నారు అని అడిగారట. ఈ విషయాలు అన్నిటిని రవితేజ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన మెగా అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. కింగ్ కోహ్లీ కూడా తమ మెగాస్టార్ పాటలకు అభిమానే అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాగా విరాట్ కోహ్లీ బయోపిక్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య ఈ బయోపిక్ గురించి నేషనల్ లెవెల్ లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. కోహ్లీ పాత్రకి రామ్ చరణ్ బాగా సెట్ అవుతాడని టాలీవుడ్ టు బాలీవుడ్ మీడియాలు వార్తలు రాసుకొచ్చాయి. మెగా అభిమానులు అయితే.. ఇది జరిగి, కోహ్లీ పాత్రలో చరణ్ కనిపిస్తే బాగుండు అని ఆశ పడుతున్నారు.