Vijay Devarakonda in Salaar 2 : సలార్ 2 లో రౌడీ స్టార్.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత..?
Vijay Devarakonda in Salaar 2 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. సలార్ 1 తో ప్రభాస్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్
- By Ramesh Published Date - 05:13 PM, Wed - 24 April 24

Vijay Devarakonda in Salaar 2 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. సలార్ 1 తో ప్రభాస్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడా లేదా సలార్ 2 శౌర్యాంగ పర్వం ను మొదలు పెడతాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వెకేషన్ మూడ్ లో ఉన్నాడు.
ఇదిలాఉంటే ప్రశాంత్ నీల్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని కలవడం సర్ ప్రైజ్ చేస్తుంది. వీరిద్దరు కలిసి ఏదైనా సినిమా చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా తో నిరుత్సాహ పరిచాడు.
తన నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరితో ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ తో విజయ్ దేవరకొండ కలవడంపై అందరు ఆసక్తి తో ఉన్నారు. మరోపక్క సలార్ 2 లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి.
అయితే విజయ్ దేవరకొండ టీం ఈ వార్తలపై స్పందించింది. ప్రశాంత్ నీల్ తో విజయ్ సినిమా అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెబుతున్నారు. సలార్ 2 లో విజయ్ నటించే అవకాశం కూడా లేదని తెలుస్తుంది.
Also Read : Fahad Fazil Avesham : బాక్సాఫీస్ దగ్గర ఆవేశం.. ఫాఫా సరికొత్త సంచలనం..!