Vijay Devarakonda : రౌడీ పుష్ప.. అల్లు అర్జున్ కి విజయ్ స్పెషల్ గిఫ్ట్..!
- By Ramesh Published Date - 11:05 PM, Thu - 28 November 24

పాన్ ఇండియా మొత్తాన్ని పుష్ప 2 మేనియాతో నింపేశాడు పుష్ప రాజ్ అల్లు అర్జున్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సినిమా గురించి ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు పుష్ప 2 టీం. సుకుమార్ అయితే సినిమా కోసం ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ఐతే ఈ క్రమంలో సినిమా టీం కు బెస్ట్ విషెస్ చెబుతూ అల్లు అర్జున్ కి రౌడీ వేర్ నుంచి ఒక క్రేజీ షర్ట్ ని పంపించాడు విజయ్ దేవరకొండ.
రౌడీ బ్రాండ్ నుంచి పుష్ప అనే డిజైన్ చేయించి మరీ ఈ షర్ట్ పంపించాడు. అది అందుకున్న అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు థాంక్యు బ్రదర్.. థాంక్స్ ఫర్ యువర్ లవ్ అంటూ మెసేజ్ పెట్టారు. విజయ్ పంపించిన ఆ షర్ట్ తో పాటు తన మెసేజ్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్లు అర్జున్.
పుష్ప 2 (Pushpa 2) ప్రమోషన్స్ లో ఎంత బిజీగా ఉన్నా తన సినిమాకు, తనకు సపోర్ట్ చేస్తున్న వారిని ఏమాత్రం వదలట్లేదు అల్లు అర్జున్. రౌడీ బ్రాండ్ నుంచి విజయ్ పంపించిన డ్రస్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు అల్లు అర్జున్ (Allu Arjun).
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాఉ 2025 మార్చి ఎండింగ్ కి రిలీజ్ లాక్ చేశారు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 సెన్సార్ కట్స్ ..