Vijay Devarakona : కేరళలో టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ మీట్..!
Vijay Devarakona కేరళ అందమైన లొకేషన్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేసుకుంటున్న ఈ మూవీ యూనిట్ సినిమాతో ఆడియన్స్ కు ఒక మంచి సర్ ప్రైజ్
- By Ramesh Published Date - 06:07 PM, Sat - 19 October 24

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakona) క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ లో సక్సెస్ రేటు తక్కువ ఉన్నా కూడా అర్జున్ అతని స్టామినా ఏంటన్నది తెలుసు కాబట్టే అతని సాలిడ్ కంబ్యాక్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. VD12 సినిమా ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ టార్గెట్ తో వస్తుంది. ప్రస్తుతం కేరళ అందమైన లొకేషన్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేసుకుంటున్న ఈ మూవీ యూనిట్ సినిమాతో ఆడియన్స్ కు ఒక మంచి సర్ ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇక కేరళలో విజయ్ షూటింగ్ అని తెలిసిన అక్కడ ఫ్యాన్స్ విజయ్ తో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు.
రౌడీ బోయ్ కి పాన్ ఇండియా లెవెల్..
కేరళలో తెలుగు హీరో ఫ్యాన్స్ మీట్ కాస్త కొత్తగా ఉన్నా.. మన తెలుగు హీరో రౌడీ బోయ్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ ని చూసి ఖుషి అవ్వాల్సిందే. మల్లూవుడ్ లో ఆల్రెడీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉండగా విజయ్ దేవరకొండ కూడా ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంటున్నాడు.
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. విజయ్ సరసన శ్రీలీల భాగ్య శ్రీ (Bhagya Sri) బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు.