Tanuja Health Update: ఐసీయూలో కాజోల్ తల్లి తనూజ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ICUలో పరిశీలనలో ఉన్నారు. కాజోల్ తల్లి తనూజ గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ముంబైలోని జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు.
- Author : Praveen Aluthuru
Date : 18-12-2023 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
Tanuja Health Update: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ICUలో పరిశీలనలో ఉన్నారు. కాజోల్ తల్లి తనూజ గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ముంబైలోని జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. 80 ఏళ్ల తనూజ వృద్ధాప్య సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నట్లు సమాచారం. తనూజా సమర్థ్ తన 16వ ఏట బాలీవుడ్‌లో నటన మొదలు పెట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమె తొలి చిత్రం ‘ఛబిలి’ విడుదలైంది. 1962లో వచ్చిన ‘మేమిడిది’ తర్వాత ఆమె అనేక చిత్రాలలో నటించింది. తనూజ తన భర్త షోము ముఖర్జీని ‘ఏక్ బార్ ముస్కురా దో’ సెట్స్‌లో కలుసుకుందట. 1973 సంవత్సరంలో అతనిని వివాహం చేసుకుంది. ఈ జంటకు కాజోల్ మరియు తనీషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Also Read: Dawood Ibrahim: విషం తాగి కరాచీలో ప్రాణాలతో పోరాడుతున్న దావూద్ ఇబ్రహీం