Venu Swamy: అల్లు అర్జున్ జాతకం బయటపెట్టిన వేణు స్వామి.. 10 సంవత్సరాల పాటు తిరుగులేదు అంటూ కామెంట్స్..!
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) జాతకంలో 10 సంవత్సరాల పాటు అదే ఉంది అంటూ తాజాగా అందరి జాతకాలు చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) సంచలన కామెంట్లు చేశారు.
- By Gopichand Published Date - 08:35 PM, Thu - 17 August 23

Venu Swamy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) జాతకంలో 10 సంవత్సరాల పాటు అదే ఉంది అంటూ తాజాగా అందరి జాతకాలు చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) సంచలన కామెంట్లు చేశారు. ఇప్పటికే వేణు స్వామి జ్యోతిష్యాలకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ పెరిగింది. ఈయన నోటి నుండి ఏదైనా మాటలు వచ్చాయి అంటే చాలు కచ్చితంగా అవి నిజమై తీరుతుంది. దాంతో ఎంతోమంది నటినటులు ఈయన దగ్గరికి పూజలు,హోమాలు చేయించుకొని ఇండస్ట్రీలో మరింత స్టార్డం సంపాదించడానికి తెగ ట్రై చేస్తున్నారు.
ఇక ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారికి తగ్గ పరిహార పూజలు చేయించి ఇండస్ట్రీలో వారికి మెరుగైన అవకాశాలు రావడానికి వేణు స్వామి పూజలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కంటే ఎక్కువ పేరు సంపాదించారు. అలాంటి వేణు స్వామి కేవలం స్టార్ హీరో హీరోయిన్ లకు పూజలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యలు ఇస్తూ కొంతమంది నటీనటుల గురించి సంచలన విషయాలు బయటపెడుతున్నారు.
Also Read: CSK: చెన్నై సూపర్ కింగ్స్ మరో మైలురాయి.. 10 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్న సీఎస్కే..!
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు యాంకర్ అల్లు అర్జున్ జాతకం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అని అడగగా.. అల్లు అర్జున్ జాతకం చాలా బాగుందని,ఈయనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని, ఈయనపై ఏ నిర్మాత అయిన 10 పెట్టుబడి పెడితే 100 రూపాయల ఆదాయం వస్తుంది అని, అలాంటి గొప్ప జాతకం అల్లు అర్జున్ కి ఉంది అని అన్నారు.
అలాగే మరో 10 సంవత్సరాలపాటు అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతారని, అసలైన పాన్ ఇండియా స్టార్ అంటే కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు వేణు స్వామి. ప్రస్తుతం వేణు స్వామి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు అందరూ సంబరపడుతున్నారు.