Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య’ వచ్చేస్తోంది!
నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీరసింహారెడ్డి. గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై
- By Balu J Published Date - 01:14 PM, Thu - 24 November 22

నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీరసింహారెడ్డి. గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ లతో అభిమానులకు ఆనందపరుస్తున్నారు. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి అంతా సిద్ధం చేశారు. ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్ జై బాలయ్య నవంబర్ 25న లాంచ్ కానుంది. ఈ సందర్భంగా ”రాజసం నీ ఇంటి పేరు’ అని పేర్కొంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్ గా కనిపించారు బాలకృష్ణ.
చాలా సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులు నినాదం ‘జై బాలయ్య’. ఇదే నినాదంతో అఖండ లో పాట కూడా వచ్చింది. సూపర్‌హిట్ పాటను స్కోర్ చేసిన ఎస్ థమన్ ఈసారి వీరసింహారెడ్డి కోసం మరో మాస్ నంబర్ జై బాలయ్య ను స్కోర్ చేశారు. నందమూరి అభిమానులకు ఇది మరో బొనాంజా. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Related News

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణలా మహేష్ బాబు కూడా.. అలా ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు..
కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా.. ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడు. కొన్ని కొత్త పద్ధతులు టాలీవుడ్ కి పరిచయం చేస్తూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నాడు.