HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Varalakshmi Sarath Kumar Saraswathi Movie Review

వరలక్ష్మీ శరత్ కుమార్ సరస్వతి మూవీ రివ్యూ

  • Author : Vamsi Chowdary Korata Date : 06-03-2026 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Saraswathi Review
Saraswathi Review

Varalakshmi Sarathkumar  సరస్వతి అచ్చమైన తెలుగు పేరు. ఇప్పటికే తెలుగులో మేటి నటిగా గుర్తింపు పొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన సినిమా ‘సరస్వతి’. టీజర్, ట్రైలర్‌లతో పెద్ద సాహసమే చేయబోతుంది అని అనిపించిన ‘సరస్వతి’ నేడు (మార్చి 06) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా కథ, కథనాలేంటి? ప్రేక్షకుల్ని ఎంతవరకూ మెప్పించాయో సమీక్షలో చూద్దాం.

తన కూతురుకి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ తల్లి కథ ‘ఎస్ సరస్వతి’. మంచి సోషల్ మెసేజ్ ఉన్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను నిలబెట్టేదీ.. థ్రిల్‌కి గురిచేసేదీ స్క్రీన్ ప్లే. కథ ఏంటి అనేదాని కంటే కూడా కథనాన్ని ఎలా నడిపించాం.. ఎంత గ్రిప్పింగ్ చూపించారన్నే కీలకం. ఒక చిన్న లైన్‌తో ప్రేక్షకుడ్ని కుర్చీల నుంచి కదలనీయకుండా చేసే సత్తా సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఉంటుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ నటించే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా.. ఏ సినిమాలో అయినా తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉందా లేదా అన్న కోణంలో ఆమె సినిమాల ఎంపిక ఉంటుంది. అలాంటి తాను నటించడమే కాకుండా.. తొలిసారి దర్శకత్వం వహించి స్వయంగా నిర్మిస్తుందీ అంటే కథలో విషయం లేకుండా ఉండదు అనే హోప్స్ అయితే కలిగించింది. అదే నమ్మకంతో ‘ఎస్. సరస్వతి’ చిత్రంతో థ్రిల్లింగ్ మూమెంట్స్ అందించింది.

లక్ష్మి (వరలక్ష్మీ శరత్ కుమార్) నర్స్‌గా పనిచేస్తుంటుంది. ఆమెకి తన 12 ఏళ్ల కూతురు సరస్వతి అంటే పంచ ప్రాణాలు. తన కూతురే లోకంగా బతుకుతుంటుంది. ఆగస్టు 15న తన కూతురు పుట్టినరోజు కావడంతో స్వీట్స్ కొనిచ్చి తానే స్వయంగా స్కూల్‌లో దింపి తాను డ్యూటీకి వెళ్లిపోతుంది. తిరిగి సాయంత్రం వచ్చేసరికి తన కూతురు కనిపించదు. స్కూల్‌ మొత్తం వెతికగా.. ఆమెకి ఊహించని షాక్ ఇస్తారు స్కూల్ యాజమాన్యం. అసలు ఆ స్కూల్‌లో సరస్వతి పేరుతో స్టూడెంట్ లేదని లక్ష్మి కావాలనే నాటకం ఆడుతుందని.. ఆమె మానసిక స్థితి సరిగాలేదని పిచ్చిదాన్ని చేస్తారు. లక్ష్మి పోలీస్ స్టేషన్‌కి వెళ్లినా కూడా న్యాయం జరగదు. రాత్రి అయ్యేసరికి తన కూతురు ఫోన్ చేసి.. తాను స్కూల్‌లోనే ఉన్నానని.. ప్రిన్సిపాల్‌తో పాటు మరో ఇద్దరు అంకుల్స్ తనని పాడు చేశారని చెప్తుంది.

కంగారుగా స్కూల్‌కి వెళ్లిన లక్ష్మికి.. రక్తం మడుగులో ఉన్న సరస్వతి కనిపిస్తుంది. హాస్పిటల్‌కి తరలించే లోపే సరస్వతి.. లక్ష్మీ ఒడిలోనే కన్నుమూస్తుంది. తన కూతుర్ని పాడుచేసి చంపేశారనే విషయం లోకానికి తెలిస్తే రకరకాల కథనాలతో ఆమె ఆత్మకి శాంతి లేకుండా చేస్తారనే భయంతో ఆ శవాన్ని పూడ్చి పెట్టేసి పోలీసులకు సమాచారం ఇస్తుంది లక్ష్మి. అయితే ఉదయం పోలీసులు వచ్చి.. తవ్వి చూసేసరికి అక్కడ డెడ్ బాడీ ఉండదు. దాంతో పోలీసులు కేసుని తీసుకోరు. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినా లక్ష్యాలు లేవనే కారణంతో ఆ కేసుని తీసుకోవడానికి ఎవరూ ముందుకురారు.

చివరికి ఓటమి ఎరుగని లాయర్‌గా పేరొందిన క్రిమినల్ లాయర్ రామానుజం (ప్రకాష్ రాజ్) ఈ కేసుని వాదించడానికి ముందుకొస్తాడు. తీరా కేసు వాదించడం మొదలుపెట్టిన తరువాత అసలు సరస్వతి అనే 12 ఏళ్ల కూతురే లేదనే విషయాన్ని తెలుసుకుని ఖంగుతింటాడు ప్రకాష్ రాజ్. ఇంతలో తన కూతుర్ని పాడుచేసి చంపేసిన ఆ ముగ్గురు దుర్మార్గుల్ని వెంటాడి వేటాడి చంపేస్తుంది లక్ష్మి. కూతురే లేనప్పుడు.. ఆ ముగ్గురూ ఎవర్ని పాడుచేశారు? ఆ చనిపోయింది ఎవరు? అసలు కూతురు ఉందా? లేదా? ఈ కేసులో రామానుజం ఎదుర్కొన్న సవాళ్లేంటి? సరస్వతి జరిగిన న్యాయం ఏంటి అన్నదే ‘ఎస్. సరస్వతి’ మిగిలిన కథ.

చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, లైంగిక వేధింపుల్ని కళ్లకి కడుతూ సోషల్‌ మెసేజ్‌ అందించే ప్రయత్నం చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్. క్రైమ్ థ్రిల్లర్‌కి కోర్ట్ రూం డ్రామాని జతచేసి తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌ని హృద్యంగా చూపించింది. కనిపించకుండా పోయిన కూతురు కోసం ఓ తల్లి ఆవేదన, అన్వేషణతో ‘సరస్వతి’ కథ మొదలౌతుంది. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల్ని కథలోకి తీసుకుని వెళ్లింది. తల్లీ, కూతుళ్ల మధ్య బాండింగ్.. వెంటనే కూతురు మిస్సింగ్.. సాక్ష్యాలు తారుమారు.. కోర్ట్ రూం డ్రామా ఇలా కథ ముందుకు వెళ్తున్న కొద్దీ ట్విస్ట్‌లు రివీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.

ప్రీ ఇంటర్వెల్ సీన్‌లో అసలు సరస్వతి అనే అమ్మాయే లేదు అని ట్విస్ట్ హైలైట్ కాగా.. మరి సరస్వతి ఎవరు? అనే ఉత్కంఠ సెకండాఫ్‌పై ఇంట్రస్ట్ పెంచింది. అక్కడి వరకూ కూడా సినిమా గ్రిప్పింగ్‌గానే సాగుతుంది. ఎప్పుడైతే కథ కోర్ట్ డ్రామా వైపుకి మళ్లిందో.. రొటీన్‌గా మారిపోయింది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్‌లు థ్రిల్లింగ్‌గా అనిపించినా.. రొటీన్ కోర్ట్ డ్రామా బోరింగ్‌గా అనిపిస్తుంది.

పైగా ప్రకాష్ రాజ్ లాంటి మేటి నటుడు వాదన వినిపిస్తున్నా కూడా.. ప్రేక్షకులకు థ్రిల్ కలగలేదంటే దానికి కారణం.. ఆ పాత్రలో కొత్తదనం లేకపోవడమే. వకీల్ సాబ్ సినిమాలో ఆల్రెడీ ప్రకాష్ రాజ్ ఈ తరహా పాత్రలో చూడటం కూడా కొత్తదనం అనిపించదు. సాధారణంగా కోర్టు డ్రామా అంటేనే బోరింగ్ ఫ్యాక్టర్. వాదనల్లో ఏ మాత్రం పసలేకపోయినా కూడా.. ప్రేక్షకులు పక్కనపెట్టేస్తుంటారు. సరస్వతి మర్డర్ మిస్టరీ వాదనల్లో పసలేకవడం వల్ల కథ తేలిపోయింది. రొటీన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.

వరలక్ష్మీ శరత్ కుమార్.. లక్ష్మీ పాత్రలో ఒదిగిపోయింది. 12 ఏళ్ల కూతురుకి జరిగిన అన్యాయంపై పోరాడే తల్లిగా జీవించేసింది. తన కూతురు చనిపోయినప్పుడు స్కూల్ సీన్ కానీ.. ఆ హాస్పిటల్, కోర్టు సీన్‌లతో ఏడిపించేసింది వరలక్ష్మీ శరత్ కుమార్. నటిస్తూ, డైరెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. కానీ ఇది తన తొలి చిత్రమైనప్పటికీ అనుభవం ఉన్న దర్శక, నిర్మాతగా మంచి మార్కులే పడతాయి. కొన్ని కొన్ని లాజిక్ లెస్ సీన్లు.. ఆమె దర్శకత్వ ప్రతిభకు అడ్డుగా తగిలినా డైరెక్టర్‌గా పాస్ మార్కులే పడొచ్చు. తన నటనలో చాలా వేరియేషన్స్ చూపించింది వరలక్ష్మి. నర్స్‌గా.. తల్లిగా.. సైకలాజికల్ డిజార్టర్ ఉన్న పేషెంట్‌గా.. శత్రువుల్ని సంహరించే వీరనారిగా మల్టీ షేడ్స్ చూపించింది. నిర్మాతగా ఆమెకి ఇదే తొలిచిత్రం అయినా అంతకు ముందు రెహ్మాన్ లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లతో మ్యూజిక్ షోలు నిర్వహించిన అనుభవం ఉండటంతో.. నిర్మాణ విలువల్ని బాగానే డీల్ చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఎటొచ్చీ ఈ కథ చెప్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది కానీ.. చూస్తుంటే మాత్రం సెకండాఫ్‌లో రొటీన్ డ్రామాలా మారిపోయింది. సెకండాఫ్‌ని మరింత గ్రిప్పింగ్‌గా తీస్తే రిజల్ట్ మరో విధంగా ఉండేది.

ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని చాలా గొప్పగా చెప్పింది వరలక్ష్మీ శరత్ కుమార్. కానీ సినిమా చూసిన తరువాత.. ఆమె సెలక్షన్ రాంగ్ అనిపించకమానదు. అసలు మ్యూజిక్ ఇచ్చింది తమనేనా? అన్నంతగా ఉంటుంది. ఏదో వాళ్లు అడిగారూ.. నేను ఇవ్వాలీ అన్నట్టుగా వాయించిపారేశాడు. ఒక్కంటంటే ఒక్క సాంగ్ కూడా గుర్తించుకునేట్టుగా లేదు. పోనీ బ్యాగ్రౌండ్ స్కోర్ అయినా బావుందా అంటే.. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది.

మిగిలిన నటీనటుల పెర్ఫామెన్స్‌కి వస్తే.. వరలక్ష్మీ శరత్ కుమార్‌కి జోడీగా జీవా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. కథని మలుపు తిప్పే పాత్రలో కనిపించాడు. ఉన్నంతలో మెప్పించాడు. ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియమణి పాత్ర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పోలీస్‌గా మురళిశర్మ, జడ్జీగా రావు రమేష్ పర్వాలేదనిపించారు. కిషోర్, సప్తగిరి, రఘుబాబు, తులసీ.. ఇతరపాత్రల్లో కనిపించారు.

ఓవరాల్‌గా ‘ఎస్. సరస్వతి’లో సోషల్ మెసేజ్ ఉంది కానీ.. సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి ఆశించేటంత థ్రిల్ అయితే కలగలేదు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heroine priyamani
  • Movie Review And Rating
  • prakashraj
  • priyamani
  • saraswathi
  • Saraswathi Movie
  • Varalakshmi Sarathkumar

Related News

Sampradayini Suppini Suddapoosani Movie Review

శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ

Sivaji  సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. ఈ డైలాగ్ రెండేళ్ల క్రితం ఓటీటీలో వచ్చిన ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌లో తొలిసారి వినిపించింది. ఆ డైలాగ్‌ని బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌గా వాడుతూ ఆ సిరీస్‌లో రన్ అయిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత అది పెద్ద మీమ్ మెటీరియల్ అయి వైరల్ అయిపోయింది. దీంతో అదే డైలాగ్‌ని సినిమా టైటిల్‌గా పెట్టి ఒక క్రైమ్ కామెడీత

  • Mrithyunjay Movie Review

    శ్రీవిష్ణు మృత్యుంజయ్‌ మూవీ రివ్యూ

Latest News

  • ServiceNow : ‘కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (CX) నివేదిక 2026’ విడుదల

  • Womens Day 2026 : మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

  • చర్చల్లో నిలిచిన ఇజ్రాయెల్ ‘బ్లూ స్పారో’ మిసైల్!

  • టీమ్ ఇండియా ఫైనల్లోకి.. ఫామ్ లేమితో సతమతమవుతున్న అభిషేక్ శర్మ!

  • జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

Trending News

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

    • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

    • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

    • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

    • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd